శ్రుతి హాసన్ పై యాక్షన్ సన్నివేశాలా?
తాజాగా శ్రుతి పాత్ర కూడా యాక్షన్ తోనే నింపేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఇంత వరకూ ఇలాంటి నెగిటివ్ రోల్ రజనీ పోషించలేదు. `భాషా` లాంటి సినిమాలో డాన్ అవతారం ఎత్తినా అది ప్రజల పక్షాన పోరాటం చేసే రోల్ అది. ఇప్పుడు ఏకంగా స్మగ్లింగ్ అనే నెగిటివ్ రోల్ లో పాజిటివ్ కోణాన్ని చూపించబోతున్నాడు.
లోకేష్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆయన సినిమాలు ఎలా ఉంటాయి అన్నది చెప్పాల్సిన పనిలేదు. తెరపై కనిపించిన ప్రతీ పాత్ర ఎంతో ఎగ్జైట్ మెంట్ ను తీసుకొస్తుంది. ఇక ఇదే సినిమాలో శ్రుతి హాసన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇంతవరకూ ఆమె పాత్ర ఎలా ఉంటుంది అన్నది బయటకు రాలేదు. తాజాగా శ్రుతి పాత్ర కూడా యాక్షన్ తోనే నింపేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా శ్రుతి హాసన్ ఆ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటుంది. రజనీ ఇంకా షూట్ లో జాయిన్ కాలేదు. కేవలం శ్రుతి హాసన్ మరో 300 మంది జూనియర్ ఆర్టిస్టుల సమక్షంలో ఈ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కథలో భాగంగా శ్రుతి హాసన్ కాస్త బోల్డ్ గానూ హైలైట్ అవుతుందని వినిపిస్తుంది. టైట్ ఫిట్ దుస్తుల్లో శ్రుతి హాసన్ మార్క్ గ్లామర్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది.
దర్శకుడు లోకేష్ తో అమ్మడికి మంచి అండర్ స్టాడింగ్ ఉంది. ఈ సినిమాలో నటించక ముందే శ్రుతి హాసన్-కనగరా జంటగా ఓ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. అందులో లొకేష్ కనగరాజ్ తో కాస్త బోల్డ్ గానే నటించింది. ఈ నేపథ్యంలో `కూలీ` లో మరింత రసవత్తరంగా కనిపించనుందని తెలుస్తోంది.