శ్రుతిహాస‌న్ లైఫ్ పార్ట‌న‌ర్ ఇలా ఉండాలి!

అలాగే ఇత‌రుల్లో స్పూర్తిని సైతం నింపేలా ఉండాలి. అలాంటి వాడు అంటే ఇష్టం` అని తెలిపింది. ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Update: 2024-10-18 17:30 GMT

కాబోయే భ‌ర్త విష‌యంలో ప్ర‌తీ అమ్మాయికి కొన్ని కోరిక‌లు ఉంటాయి. చేసుకునే వాడి లో ఆ క్వాలిటీలు..ఈ క్వాలిటీలు ఉండాల‌ని ఓపెన్ అవుతుంటారు. తాజాగా శ్రుతిహాస‌న్ కూడా భ‌ర్త విష‌యంలో తొలిసారి ఓపెన్ అయింది. ` అత‌డు ఆద‌ర్శంగా ఉండాలి. న‌న్ను ఎప్పుడూ జోక్స్ వేసి న‌వ్వించాలి. క్రియేటివ్ గా ఉండాలి. అలాగే ఇత‌రుల్లో స్పూర్తిని సైతం నింపేలా ఉండాలి. అలాంటి వాడు అంటే ఇష్టం` అని తెలిపింది. ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

అయితే ఈ వ్యాఖ్య‌ల్ని జోడిస్తూ శ్రుతి హాస‌న్ మాజీ బోయ్ ప్రెండ్ క‌థ‌లు తవ్వి తీస్తున్నారు నెటి జ‌నులు. అమ్మ‌డు తొలిసారి విదేశీయుడు మైఖెల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసింది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత శ్రుతి తొలి ప్రేమికుడు అత‌డే. అత‌డి కోసం కెరీర్ ని సైతం ప‌క్క‌న‌బెట్టి ముందుకెళ్లింది. డాడ్ క‌మ‌ల్ హాస‌న్ కి ప‌రిచ‌యం చేసింది. నేరుగా ఇంట్లోనే లంచ్..డిన్న‌ర్ పార్టీలు ఎంజాయ్ చేసారు. కానీ ఆ బంధం కొంత కాల‌మే నిలిచింది.

ఏ కార‌ణంతో విడిపోయారో తెలియ‌దు గానీ..శ్రుతి హాస‌న్ మాత్రం మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు గురైంది. అటుపై కొంత గ్యాప్త తీసుకుని ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికాతో ల‌వ్ లో ప‌డింది. ఇత‌డితోనూ బాగానే సావాసం చేసింది. ఎంతో క్లోజ్ గా మూవ్ అయింది. అయితే తొలి ప్రేమ వైఫ‌ల్యంతో రెండ‌వ‌సారి జాగ్ర‌త్త ప‌డింది. మ‌న‌సును మ‌రీ అంత‌గా గాయ‌ప‌రుచుకోలేదు. కొంతకాలం అనంత‌రం అమ్మ‌డు ఇత‌డికి క‌టీఫ్ చెప్పింది.

శంత‌ను తో జ‌ర్నీ క్రేజీ ప్ర‌యాణ‌మ‌ని, త‌న‌తో ఉన్నంత కాలం త‌న గురించి ఎన్నో విష‌యాలు తెలుసుకున్నాను అంది. నెటి జ‌నుల ప్ర‌శ్న ఏంటంటే? శ్రుతి హాస‌న్ కోరుకున్న ల‌క్ష‌ణాలు వాళ్లిద్ద‌రిలో లేవా? అందుకేనా బ్రేక‌ప్ అనే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. మ‌రి వీటి గురించి అమ్మ‌డు ఎలా రియాక్ట్ అవుతుందో.

Tags:    

Similar News