ఆ స్టార్ హీరో కోసం హీరోయిన్ గానం!

తాజాగా అమ్మ‌డు త‌ల‌ప‌తి విజ‌య్ క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` కోసం సింగ‌ర్ గా మారుతుంది.

Update: 2024-07-27 07:30 GMT

శ్రుతిహాస‌న్ మ‌ల్టీట్యాలెంటెడ్ అన్న సంగ‌తి తెలిసిందే. న‌టి కాక ముందే! సింగ‌ర్ గా, మ్యూజిక్ బ్యాండ్ నిర్వాహ‌కురాలిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా ప‌నిచేసింది. స్టార్ హీరోయిన్ అయిన త‌ర్వాత వాటిని విడిచి పెట్ట‌లేదు. అవ‌స‌రం మేర అప్పుడ‌ప్పుడు లైవ్ పెర్పార్మెన్స్ ల‌తో అద‌ర‌గొడుతుంది. అలాగే ఇత‌ర స్టార్ హీరోల చిత్రాల్లో పాడే అవ‌కాశం వ‌చ్చినా మిస్ చేసుకోకుండా ప‌నిచేస్తుంది. హీరోయిన్ అయిన త‌ర్వాత ఎన్నో సినిమాల‌కు గాత్రం అందించింది.

తాజాగా అమ్మ‌డు త‌ల‌ప‌తి విజ‌య్ క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` కోసం సింగ‌ర్ గా మారుతుంది. యువన్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం శ్రుతిని పాట ఆల‌పించాల్సిందిగా యూనిట్ కోరిందిట‌. దీంతో శ్రుతి హాస‌న్ తాను ఎంత బిజీగా ఉన్నా? ఏదో ఒక రోజు కేటాయించుకుని స్టూడియోకి వ‌చ్చి పాడ‌తాన‌ని చెప్పిందిట‌. అనుకున్న‌ట్లుగానే ఆ మాట‌ను నిల‌బెట్టుకుంది.

ఇటీవ‌లే ఆ పాట పాడి పూర్తిచేసిందిట‌. రికార్డింగ్ పూర్తిచేసుకున్న ఈ పాట‌ని ఆగ‌స్టులో రిలీజ్ చేయ‌నున్నారుట‌.

సినిమాకి ఈ పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర బృందం ధీమా వ్య‌క్తం చేసింది. అలాగే ఈ పాట‌ని ప్రీ రిలీజ్ వేడుక స‌మ‌యంలోనూ శ్రుతి హాస‌న్ లైవ్ పెర్పార్మెన్స్ ఇవ్వ‌డానికి ఛాన్సు లేక‌పోలేదు. అగ్ర హీరోల వేదిక‌పై అలాంటి అవ‌కాశం వ‌చ్చిందంటే? శ్రుతిహాస‌న్ చాన్స్ మిస్ చేసుకోదు.

చేతిలో స‌మ‌యం ఉంటే క‌చ్చితంగా లైవ్ లో నూ పాడుతుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ షూటింగ్ ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. `డెకాయిట్`..`కూలీ` చిత్రాల్లో న‌టిస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న `స‌లార్ -2` షూట్ లోనూ జాయిన్ అవ్వాల్సి ఉంది. దీంతో పాటు మ‌రో త‌మిళ సినిమాకి హాజ‌ర‌వ్వాలి.

Tags:    

Similar News