సిద్ధార్థ్- అదితి పెళ్లి తేదీ ప్రకటించే వేళ
ప్రేమ జంట ఒకటయ్యేవేళ ఇది. తొందర్లోనే ఉంది ముహూర్తం. పెళ్లికి భాజాలు మోగేందుకు ఇంకెంతో సమయం లేదు.
ప్రేమ జంట ఒకటయ్యేవేళ ఇది. తొందర్లోనే ఉంది ముహూర్తం. పెళ్లికి భాజాలు మోగేందుకు ఇంకెంతో సమయం లేదు. ఒక మంచి డేట్ ఫిక్స్ చేసి ప్రకటించేందుకు అంతా సిద్ధమైందని సమాచారం. ఇంతకీ ఇది ఏ జంట గురించి అంటే... ఇంకెవరై ఉంటారు! కచ్ఛితంగా సిద్ధార్థ్ - అదితి రావు హైదరీ గురించిన సమాచారమే ఇది.
ఇటీవల ప్రఖ్యాత యాపిల్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్లకు హాజరవుతూ అమెరికాలో తమ సమయాన్ని ఆస్వాధిస్తోంది ఈ జంట. అభిమానులు ఈ అందమైన జోడీ పెళ్లి తేదీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, సస్పెన్స్ కి తెర దించే సమయం ఆసన్నమైంది.
సిధ్-అదితీ జంట అమెరికా ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎగ్జయిట్ చేసే విషయం చెబుతామని వెల్లడించారు. అది కచ్ఛితంగా పెళ్లి తేదీ గురించేనని అంతా భావిస్తున్నారు. వనపర్తిలో తన ముత్తాతలు కట్టించిన చారిత్రాత్మక దేవాలయంలో హిందూ సంప్రదాయ పద్ధతుల్లో తమ పెళ్లి జరగనుందని గతంలోనే అదితి చెప్పింది. విదేశాల్లో డెస్టినేషన్ తరహాలో కాకుండా, తెలుగు రాష్ట్రంలో ఈ సెలబ్రిటీ వివాహం ఎంతో వైభవంగా జరగనుందనేది ఆసక్తిని కలిగిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే...అదితి రావు హైదరీ `హీరమండి`లో అద్భుతమైన నట ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో తన ఉత్తమ నటనను అందించిందని ప్రశంసలు అందుకుంది. సిద్ధార్థ్ ఇటీవల కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 చిత్రంలో కనిపించాడు. తదుపరి సినిమాల గురించి వెల్లడించే ముందే పెళ్లి తేదీని చెబుతారని అంతా ఆశిస్తున్నారు.