మిస్టర్ బచ్చన్.. యంగ్ హీరో కూడా..
అయితే కేవలం రైడ్ మూవీ నుంచి స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని తనదైన స్క్రీన్ ప్లే తో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజ్ రవితేజ నుంచి రాబోతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. హిందీ మూవీ కి రీమేక్ గా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ రెడీ చేస్తున్నారు. అయితే కేవలం రైడ్ మూవీ నుంచి స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని తనదైన స్క్రీన్ ప్లే తో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్షే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందంట. ఈ చిత్రంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ క్యామియో రోల్ చేశాడంట. అతని క్యారెక్టర్ కి సంబంధించి షూట్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
సిద్దు ఈ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తర్వాత అతని ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో సిద్దు జొన్నలగడ్డకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇది మిస్టర్ బచ్చన్ సినిమాకి ఎంతో కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాదిలో ఈగల్ సినిమాతో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ఈగల్ సినిమాని కూడా నిర్మించారు. ఆ వెంటనే హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ మూవీ స్టార్ట్ చేశారు. ఈ సినిమా మాత్రం కమర్షియల్ సక్సెస్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు.
హరీష్ శంకర్ ఐదేళ్ల తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. మిస్టర్ బచ్చన్ మూవీకి మిక్కీ జె మియర్ సంగీతం అందించారు. గద్దల కొండ గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ కోసం మిక్కీ జె మియర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ఒక డ్యూయెట్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. రవితేజ, హరీష్ శంకర్ మిరపకాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరల చాలా కాలం తర్వాత మిస్టర్ బచ్చన్ వీరిద్దరి కలయికలో రాబోతోంది.