టిల్లుబాబుని ఇక టిల్లుభాయ్ అనేలా!
తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఓ ప్రత్యేకమైన మ్యానరిజమ్ తోనే ఇది సాధ్యమైంది
సిద్దుజొన్నల గడ్డ నేడు పరిచయం అవసరం లేని పేరు. పదేళ్ల పాటు ఇండస్ట్రీలో అవిశ్రామంగా పనిచేస్తే ఇప్పుడు మార్కెట్ లో తానో బ్రాండ్ గా మారాడు. 'జోష్' నుంచి 'మావింతగాధ వినుమా' వరకూ అతని ప్రయాణం వేరు. ఈ మధ్యలో పది పన్నెండు సినిమాలు చేసాడు. కానీ వాటితో సిద్దు ఏమాత్రం ఫేమస్ కాలేదు. నటుడిగా చెప్పుకోవడానికి చేసిన సినిమాలు తప్ప అతడి ఐడెంటిటీ ఎక్కడా కనిపించదు.' డీజేటిల్లు' నుంచి అతడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో తనని తానే స్టార్ గా మార్చుకున్నాడు.
తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఓ ప్రత్యేకమైన మ్యానరిజమ్ తోనే ఇది సాధ్యమైంది. ఇటీవల రిలీజ్ అయిన 'టిల్లుస్వ్కేర్' విజయంతో ఆ ఇమేజ్ రెట్టింపు అయింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపో తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అది జరిగితే అతడి రేంజ్ స్కైని టచ్ చేసినట్లే. టైర్ -2 హీరోల జాబితాలో చేరిపోతాడు. నాని..నాగచైతన్య...రామ్..నితిన్..నిఖిల్ లాంటి హీరోల సరసన అతడి స్థానం పదిలమవుతుంది. ఇప్పటికే 'తెలుసుకదా'..'జాక్' అనే మరో రెండు చిత్రాలు చేస్తున్నాడు.
'టిల్లు స్క్వేర్' కంటే ముందే కన్పమ్ అయిన ప్రాజెక్ట్ లివి. తాజా సక్సెస్ నేపథ్యంలో హీరోగా మరింత బిజీ అవ్వడం ఖాయం. హీరోకి అడ్వాన్సులు ఇచ్చే నిర్మాతల సంఖ్య పెరుగుతంది ఇప్పుడు. 'డీజేటిల్లు' ప్రాంచైజీ నుంచి ఆరేడు సినిమాలైనా ఉండాలంటున్నాడు నిర్మాత నాగవంశీ. నిర్మాతగా అతడికి కోట్ల లాభాలు తెస్తోన్న నేపథ్యంలో సిద్దుని సదరు నిర్మాత ఇప్పట్లో బయటకు వదలడం కూడా కష్టమే. ఇప్పటికే 'టిల్లుక్యూబ్' ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది తెలియదు కానీ..ఈ ప్రాంచైజీ మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. అలాగే సిద్దు హీరోగా దర్శకురాలు నందిని రెడ్డి తో కూడా ఓ ప్రాజెక్ట్ ఒకే అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ తన బిజీ షెడ్యూల్ కారణంగా అది వీలుపడలేదు. మెగాస్టార్ తో మళ్లీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మాత్ర ఆ ఛాన్స్ మిస్ చేసుకోను అంటున్నాడు.