బందిపోటు చూసి బందిపోటు అయిపోతారంటే ఎలా!

తాజాగా ఇవే ప్ర‌శ్న‌లు యువ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ముందుకెళ్లాయి. వీటికి ఆయ‌న త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు.

Update: 2024-04-02 06:50 GMT

నేటి జ‌న‌రేష‌న్ యువ‌త‌పై సినిమాల ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌ని ఎప్ప‌టి నుంచో వినిపిస్తోన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. యువ‌త చెడిపోవ‌డానికి కార‌ణం కేవ‌లం సినిమాలే? అని ఎంతో మంది ఆరోపించారు. యువ‌త‌కి తెలియ‌ని విష‌యాలెన్నో సినిమాలు చూసి నేర్చుకుంటున్నార‌ని త‌ద్వారా ర‌క‌ర‌కాల చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు అందుకు సినిమా అనే మాధ్య‌మం కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని కొన్ని ఆరోప‌ణ‌లున్నాయి.సినిమాల్లో హీరోల్లా రియ‌ల్ లైఫ్ లో ప్ర‌యోగాలు చేసి చేతులు కాల్చుకుంటున్నార‌ని..జీవితాలు నాశనం చేసుకుంటు న్నార‌ని మీడియాలో ఎన్నో ర‌కాల క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కించాయి.


తాజాగా ఇవే ప్ర‌శ్న‌లు యువ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ముందుకెళ్లాయి. వీటికి ఆయ‌న త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. `యానిమల్‌` ప్రస్తావన తీసుకు వచ్చారు కాబట్టి చెబుతున్నా. నాకు ‘యానిమల్‌’ బాగా నచ్చింది. దానిలో హీరో పాత్రను- అతని చిన్నతనంలో పడిన వేదన కోణం నుంచి చూడాలి.

నా ఉద్దేశంలో సినిమా నైతిక బాధ్యతలను పెంపొందించే ఒక సాధనం కాదు. సొసైటీని సరిదిద్దాల్సిన బాధ్యత దానికి లేదు. సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే. సినిమాలో హీరో పాత్ర నచ్చకపోతే వాడిని హీరో అనుకోవద్దు. నచ్చిన విధంగా నిర్వచించుకొనే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. బందిపోటు సినిమా చూసి నేను బందిపోటు అయిపోలేదు. గ్యాంగస్టర్‌ సినిమా చూసి గ్యాంగస్టర్‌ అయిపోలేదు. సినిమా చూశాను.

ఎంటర్‌టైన్‌ అయ్యాను. ఇంటికి వచ్చేసి నా పని నేను చేసుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువగా నేను ఆలోచించను. ఎవ‌రి ఎలా ఆలోచిస్తున్నారు అన్న‌ది వాళ్ల ఆలోచ‌నా విధానం..మ‌న‌స్త‌త్వాన్ని బ‌ట్టి ఉంటుంది. య‌వ‌త‌పై ప్ర‌భావం ఉంటుంద‌ని భావిస్తే గ‌నుక దాని కోసమే సెన్సార్ అనేది ఒక‌టి ఉంది. దానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. ఏ వయస్సు వారు ఎలాంటి సినిమాలు చూడాలో ఆ విధివిధానాలు చెబుతాయి.. కానీ ఆ విధివిధానాలను ఎవరు పాటించరు కదా... చట్టం ఉంది. నేరాలు జరగకూడదు అనుకుంటే కుదరదు. ప్రపంచంలో ఆ విధంగా పనులు జరగవు` అని అన్నారు.

Tags:    

Similar News