సీక్వెల్‌కి రాసేప్పుడు చెమ‌ట‌లు ప‌ట్టేశాయ్‌: సిద్ధు

తాజాగా ప్రీరిలీజ్ వేడుక‌లో చిత్ర‌బృందం ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Update: 2024-03-27 16:25 GMT

డిజే టిల్లు సీక్వెల్ క‌థ‌తో రూపొందించిన 'టిల్లు స్క్వేర్' ఈనెల 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. తాజాగా ప్రీరిలీజ్ వేడుక‌లో చిత్ర‌బృందం ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

వేదిక‌పై చిత్ర క‌థానాయ‌కుడు సిద్ధు జొన్న‌ల గ‌డ్డ మాట్లాడుతూ- ''డీజే టిల్లు పాత్ర యూత్ బేస్డ్ మాస్ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా. రిలీజైన‌ త‌ర్వాత అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగించే విజ‌యం ద‌క్కింది. ఫ్యామిలీ ఆడియెన్ ఆడ‌వాళ్లు చిన్న పిల్ల‌లు అంద‌రికీ బాగా ఎక్కేసింది ఆ పాత్ర . నిజాయితీ ఉన్న డిజే టిల్లు పాత్ర‌ను మీరంతా గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఎక్క‌డికి వెళ్లినా సిద్ధూ కంటే ఎక్కువ‌గా టిల్లు అనే పిలుస్తారు. ఎక్క‌డ క‌నిపించినా టిల్లు అన్నా ఒక ఫోటో దిగుదామా? అంటూ ప్రేమ‌గా అడుగుతారు. టిల్లు పాత్ర‌ను అంత‌ పెద్ద స‌క్సెస్ చేసారు.

అది హిట్ట‌య్యాక పార్ట్ 2 తీయాల‌ని అన్నారు. మొద‌ట నేను చాలా భ‌య‌ప‌డ్డాను. ఒక‌టో భాగం ఎంత ఎంట‌ర్ టైన్ చేసిందో అంత‌కుమించి సీక్వెల్ లో ఎంట‌ర్ టైన్ చేయాలి. అంత‌కుమించి వినోదం అందించాలి. టిల్లు పాత్ర ఈసారి కూడా అంతే ఫేమ‌స్ అవ్వాలి! అనుకున్నాం. కూర్చిని రాసి రాసి చాలా ప్ర‌య‌త్నించాం. చాలా వెర్ష‌న్లు రాసుకున్నాం. మాకు చెమ‌ట‌లు ప‌ట్టాయి .. చాలా లెంగ్తీ ప్రాసెస్ చేసాం. ఆ త‌ర్వాత మేమంతా ఒక యుద్ధానికి వెళుతున్నామ‌ని అర్థ‌మైంది. యుద్ధం గెలుస్తామో లేదో తెలీదు.. కానీ మ‌న పోరాటం మాత్రం మ‌న చేతుల్లోనే ఉంది.. ఇప్ప‌టికే సినిమా కాపీ చూశాం. ఇంట‌ర్వెల్ టైమ్ కే మ్యాసివ్ హైతో ఆడియెన్ బ‌య‌ట‌కు వ‌స్తారు. అలాంటి హైలైట్ లు సినిమాలో చాలా ఉన్నాయి. త‌ప్ప‌క విజ‌యం సాధిస్తాం. మార్చి 29న థియేట‌ర్ల‌లో క‌లుద్దాం'' అని అన్నారు. ఇంకా సిద్ధు మాట్లాడుతూ-''మ్యాడ్ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ మా సినిమాకి చాలా స‌హాయం చేసాడు. నిర్మాత వంశీ రాజీ అన్న‌దే లేకుండా పెట్టుబ‌డులు పెట్టారు. ఈ సినిమా మా కంటే ఎక్కువ‌గా త్రివిక్ర‌మ్ గారికి అర్థ‌మైంది. సినిమా రైటింగ్ లో ఆయ‌న‌ చాలా స‌హాయం చేసారు. భీమ్స్ మంచి నేప‌థ్య సంగీతం అందించారు. టిల్లులోని మాస్ ని ఇంకా ఇంకా బ‌య‌టికి తీసాడు అత‌డు. నా సినిమా పాట‌ల గాయ‌నీగాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కుడు అంద‌రూ గొప్ప ప‌నిత‌నం క‌న‌బ‌రిచారు.

డీజే టిల్లు టైటిల్ పాట ఎవ‌రు చేయాలి? అని ఆలోచించిన‌ప్పుడు ఓ ఇద్ద‌రిని అనుకున్నాం. ఒకేసారి ఇద్ద‌రికీ ఫోన్ లు చేయ‌గా.. రాము వెంట‌నే ఫోన్ తీసాడు. త‌ను డిజే టిల్లు పాట‌కు ప్ర‌ధాన బ‌లం. లిరిసిస్ట్ కాస‌ర్ల శ్యామ్ అంత బాగా రాసారు. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లోని ఆ పాట డిజే టిల్లు సినిమాని స‌గం భుజంపై మోసింది. ఆ పాట‌ను ఇచ్చిన ఇద్ద‌రికీ ధ‌న్య‌వాదాలు. 'ఓ బేబి' చిత్రానికి పాడిన శ్రీ‌రామ్ గారి పాట విని మా సినిమాకి పాడించాం. అత‌డిది బ్యూటిఫుల్ వాయిస్.. బ్రేక‌ప్ జ‌ర్నీపై బాగా పాడ‌తారు. మా విజ‌యానికి స‌హ‌క‌రించిన అంద‌రికీ, మా వెన్నంటి నిలిచిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు.. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ మాట్లాడుతూ-''చివ‌రి రెండేళ్లుగా టిల్లు అన్న అంటూ మా సినిమాని, మా పాట‌ను మీరంతా గుర్తు పెట్టుకుని అభిమానించారు. ఈ రెండేళ్ల జ‌ర్నీలో సినిమా గురించి చాలా విష‌యాలు మాట్లాడుకున్నాం. ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు త్రివిక్ర‌మ్ గారికి ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాతో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ లాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. 2 రోజుల క్రితం ఫుల్ కాపీ చూశాను. అద్భుతంగా వ‌చ్చింది. విజ‌యం సాధిస్తున్నాం'' అని అన్నారు.

Tags:    

Similar News