మండే ఎండలో సికిందర్ బ్యూటీ మరింత హీటెక్కించేలా!
డిజైనర్ దుస్తులేసినా.. సంప్రదాయ దుస్తులైనా షామా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే.
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం డిజైనర్ దుస్తుల్లో శామా సెగలు నె ట్టింట చర్చకొస్తుంటాయి. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరి. హీటెక్కించే ఘాటు ఫోజులతో కుర్రకారుని అలరించడం అమ్మడి ప్రత్యేకత. డిజైనర్ దుస్తులేసినా.. సంప్రదాయ దుస్తులైనా షామా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే. మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలవాలంటే? ఆ మాత్రం తప్పదంటూ ముందుకు సాగిపోతుంది.
సినిమా ఛాన్సులు తగ్గినా ఇంకా మీడియాలో ఫాంలో కనిపిస్తుందంటే? కారణం ఈ రకమైన ఎలి వేషన్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అమ్మడు భగ భగ మండే ఎండలో నలుపు చీరలో తళుక్కున మెరిసింది. ప్రకాశ వంతమైన ఎండ తీవ్రతకు షామా స్కిన్ టోన్ మరింత మెరిసిపోతుంది. భానుడి భగ భగ మధ్య అంత్యంత కష్టమైన ఫోటో సెషన్ ఇది. ఓ వైపు సూర్యారావు ప్రతాపం..మరోవైపు ఆ వేడి కారణంతో చీర మరింత పొగలు కక్కడం మధ్య పోటో షూట్ అంటే కత్తి మీద సాము లాంటింది.
అయినా సికిందర్ బ్యూటీ ఎలివేషన్ పరంగా ఏమాత్రం తగ్గలేదు. సొగసరి అలంకరణ ప్రతీది శామిని మరింత అందంగా తీర్చిదిద్దాయి. పవిట అంచును అల్లా చేతితో గొల్లోకి ఎత్తి నవ్వుతూ కెమారాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నె ట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోకి ఇలా ట్యాగ్ లైన్ ఇంచ్చింది. `మెయిన్ తేహ్రీ రాహి, జమీన్ చల్నే లగీ` అంటూ లవ్ సింబల్స్ జోడించింది. శామా చీరందానికి యువత ఫిదా అవుతుంది. తమదైన శైలిలో ప్రపోజల్స్ గుప్పిస్తున్నారు.
ఇక షామా కెరీర్ సంగతి చూస్తే `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.