పవన్ కళ్యాణ్ OG కోసం శింబు

OG సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడారంట. గతంలో శింబు కొన్ని తెలుగు పాటలు ఆలపించారు.

Update: 2024-09-03 03:59 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ OG. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ మూవీ కొంతకాలం షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా ఎన్నికలు అయిన వెంటనే మరల షూటింగ్ స్టార్ట్ చేయలేకపోయారు. అయితే పెండింగ్ సినిమా షూట్స్ కంప్లీట్ చేస్తానని పవన్ కళ్యాణ్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

దాంతో అందరూ షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. OG మూవీ షూట్ కోసం విశాఖపట్నంలో సెట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారంట. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా OG నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే తెలుగు రాష్ట్రాలలో, తుఫాన్, వరదల ప్రభావం కారణంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా పడింది.

నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. త్వరలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సాంగ్ కి సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. OG సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడారంట. గతంలో శింబు కొన్ని తెలుగు పాటలు ఆలపించారు. జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో సాంగ్ పాడారు. రామ్ పోతినేని ది వారియర్ లో బుల్లెట్ సాంగ్ కూడా శింబుని పాడటం విశేషం.

చాలా హిట్ సాంగ్స్ ని హీరో శింబు తెలుగులో పాడి అందరికి చేరువ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ OG సినిమా కోసం శింబుతో పాట పాడించారంట. దానినే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారంట. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ బర్త్ గిఫ్ట్ గా ఈ సాంగ్ OG నుంచి రిలీజ్ అయ్యేది. సిచువేషన్ అనుకూలించకపోవడంతో ఈ పాటకోసం మరికొంత సమయం ఎదురుచూడాల్సి వస్తోంది.

OG సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం శింబు పాట పాడాడనే విషయం తెలియడంతో ఇప్పుడు ఆ సాంగ్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ సాంగ్ హిట్ అయితే కచ్చితంగా OG చిత్రంపైన కూడా అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే సుజిత్ ఈ సినిమా షూటింగ్ ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ అప్డేట్ పై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. డివివి దానయ్య OG సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News