ముదురు భామలే కావాలంటున్న హీరో ?
జెట్ స్పీడ్ గా ఆ సినిమాను పూర్తి చేసే విధంగా విజయ్ బల్క్ డేట్లు ఇవ్వడం జరిగిందట.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్న విషయం తెల్సిందే. పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలని విజయ్ భావిస్తున్నాడట. ఇటీవలే ది గోట్ సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే విజయ్ సినిమా అంటూ ప్రచారం జరిగింది. కానీ విజయ్ మరో సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడు. హెచ్ వినోత్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ డ్రామాను విజయ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. జెట్ స్పీడ్ గా ఆ సినిమాను పూర్తి చేసే విధంగా విజయ్ బల్క్ డేట్లు ఇవ్వడం జరిగిందట.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని విజయ్ భావిస్తున్నాడు. దర్శకుడు హెచ్ వినోత్ ఆ దిశగా ప్లాన్ చేస్తున్నాడు. చాలా తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేస్తామని వినోత్ సన్నిహితుల వద్ద చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ కి జోడీగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. విజయ్ కాస్త ఎక్కువ ఏజ్ ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకే విజయ్ కి జోడీగా సిమ్రాన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.
విజయ్ గత చిత్రాలు లియో, ది గోట్ లో సీనియర్ హీరోయిన్స్ తో నటించాడు. లియో సినిమాలో త్రిష తో నటించిన విజయ్ ఇటీవల విడుదల అయిన ది గోట్ సినిమాలో స్నేహాతో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అంతకంటే సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తో విజయ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నేపథ్యంలో అంతా అవాక్కవుతున్నారు. నెట్టింట ఇప్పటికే ఈ సినిమా గురించిన చర్చకు తెర లేసింది. విజయ్ కి జోడీగా త్రిష, స్నేహ అంటే పర్వాలేదు... సిమ్రాన్ ను ఎలా తీసుకుంటారు అంటూ దర్శకుడు వినోత్ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.
ది గోట్ సినిమాలో స్నేహా తో పాటు మరో హీరోయిన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలోనూ సిమ్రాన్ తో పాటు మరో హీరోయిన్ ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్ కొత్త సినిమా హీరోయిన్ సిమ్రాన్ అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఈ విషయమై క్లారిటీ వస్తుందని అంతా ఆశిస్తున్నారు. రాజకీయ ఎంట్రీ కి ముందు రాబోతున్న సినిమా అవ్వడంతో ఏ ఒక్కరు విమర్శించే విధంగా ఉండకుండా, క్లీన్ పొలిటికల్ డ్రామాగా, పెద్దగా లవ్ ట్రాక్ లేకుండా సినిమా సాగే విధంగా ప్లాన్ చేస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.