సీతారామం కొనసాగిస్తారా..?

సీతారామం హిట్ తర్వాత ఈ సినిమా కథని కొనసాగించేలా హనుకి ఒక ఆలోచన ఉందట.

Update: 2023-08-12 10:04 GMT
సీతారామం కొనసాగిస్తారా..?
  • whatsapp icon

హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా సీతారామం. 2022 ఏడాది క్రితం రిలీజైన ఈ సినిమా మరోసారి వైజయంతి బ్యానర్ వ్యాల్యూని నిలబెట్టింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్, స్వప్న, ప్రియాంకా దత్ లు ఈ సినిమా నిర్మించారు. అప్పటికే మహానటితో హిట్ అందుకున్న దుల్కర్ తో సీతారామం సినిమా చేశారు ఈ నిర్మాతలు. మహానటి సినిమా కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే వచ్చింది. ఆ నమ్మకంతోనే దుల్కర్ మీద మరోసారి పాతిక కోట్ల పైన బెట్ పెట్టారు అశ్వనిదత్.

డైరెక్టర్ హను రాఘవపూడి కూడా సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ కూడా కాదు అయినా కూడా సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాతోనే మృణాల్ ఠాకూర్ తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ వచ్చి సినిమా ఛాన్స్ లు అందుకున్న ఆమె హృతిక్ రోషన్ సూపర్ 30లో నటించి మెప్పించింది. ఆ సినిమాలో మృణాల్ ని చూసే హనుకి సీతారామం లో సీత ఆమె అయితేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ చేశారు. సీతారామం సినిమా ఏ ముహుర్తాన ఒప్పుకుందో కానీ మృణాల్ ఫేట్ మారిపోయిందని చెప్పొచ్చు.

వరుస సినిమాలతో ఇటు తెలుగు అటు హిందీలో అదరగొట్టేస్తుంది మృణాల్. సీతారామం హిట్ తర్వాత ఈ సినిమా కథని కొనసాగించేలా హనుకి ఒక ఆలోచన ఉందట. అయితే అది ఇప్పుడప్పుడే మెటీరియలైజ్ అవ్వదు కానీ కొంత టైం తీసుకున్నా సరే కచ్చితంగా సీతారామం సినిమా కొనసాగింపు ఉంటుందని అది కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని హను రాఘవపుడి ఒకానొక సందర్భంలో చెప్పారు. సీతారామం పార్ట్ 2 కూడా ఉంటే ఆ సినిమాను ఇష్టపడే ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.

ఆల్రెడీ మహానటితో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న దుల్కర్ సల్మాన్ సీతారామం హిట్ తో ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో తనకు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే ఇస్తున్నారు అని కింగ్ ఆఫ్ కోట అనే మాస్ సినిమాతో వస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఆ సినిమా దుల్కర్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. ఇదే కాదు తెలుగులో కూడా ఒకటి రెండు కథలు దుల్కర్ తో చర్చలు జరుగుతున్నాయట.

Tags:    

Similar News