అక్క గురించి స్టార్ హీరో పోస్ట్ వైరల్!
దాంతో పాటు ఆ సినిమాలో మేజర్ ముకుంద్ పాత్రలో నటించినందుకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.
తమిళ్‌లో ప్రస్తుతం శివ కార్తికేయన్ స్టార్ హీరోల సరసన నిలిచారు. ఇటీవల ఆయన నటించిన అమరన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా రూ.350 కోట్ల వసూళలను సొంతం చేసుకుంది. దాంతో పాటు ఆ సినిమాలో మేజర్ ముకుంద్ పాత్రలో నటించినందుకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఒక వీజేగా కెరీర్‌ను ఆరంభించిన శివ కార్తికేయన్ ఎక్కడి నుంచి ఎక్కడికో తన జర్నీ సాగించారు అంటూ అద్భుతమైన ఆయన జర్నీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతూ వస్తోంది.
తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన అక్క యొక్క గొప్పతనం గురించి చెబుతూ పెట్టిన పోస్ట్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. తన అక్క పుట్టిన రోజు సందర్భంగా శివ కార్తికేయన్ ఇన్‌స్టాలో... మై డియర్ అక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు, నువ్వు నాకు స్ఫూర్తి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేశావు. అంతే కాకుండా 38 ఏళ్ల వయసులో ఎండీ చేసి గోల్డ్ మెడల్ సాధించావు. నీ 42 ఏళ్ల వయసులో ఎఫ్‌ఆర్‌సీపీ సాధించడం గొప్ప విషయం. ఇప్పటి వరకు నువ్వు సాధించిన ఎన్నో ఘనతలు చూసి నేను స్ఫూర్తి పొందుతూ ఉంటాను. నిన్న చూసి నాన్న గర్వపడుతూ ఉంటారు. థాంక్యూ అథాన్ నువ్వు ఎల్లప్పుడు అక్కకు తోడుగా ఉన్నావు అంటూ పోస్ట్ చేశాడు.
శివ కార్తికేయన్ సైతం లేటు వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ముఖ్యంగా టీవీ యాంకర్‌గా చేసిన శివ కార్తికేయన్ మెల్ల మెల్లగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, గొప్ప పాత్రలు ఎంపిక చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి, బ్యాక్ గ్రౌండ్ లేని వారికి శివ కార్తికేయన్ ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి శివ కార్తికేయన్ తన అక్క గురించి పోస్ట్ చేసిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాదిలో అయలాన్ సినిమాతో పాటు అమరన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. ఇదే ఏడాదిలో సూపర్ స్టార్ విజయ్ సినిమా ది గోట్‌లోనూ శివ కార్తికేయన్ నటించి మెప్పించాడు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన ఈ సమయంలో కోలీవుడ్ లో ఇకపై శివ కార్తికేయన్ ఆధిపత్యం కొనసాగబోతుంది అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా విజయ్ ఫ్యాన్స్ సైతం శివ కార్తికేయన్ వైపు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.