హీరో వాటికి బానిస..అందుకే హీరోయిన్ బొద్దుగా!
కోలీవుడ్ హిట్ పెయిర్ శివకార్తికేయన్- ప్రియాంక అరుల్ మోహన్ జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
కోలీవుడ్ హిట్ పెయిర్ శివకార్తికేయన్- ప్రియాంక అరుల్ మోహన్ జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన `డాక్టర్`..`డాన్` చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో ప్రియాంక కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గామారిపోయింది. ప్రస్తుతం అక్కడ వరుసగా ఛాన్సులు అందుకుంటుంది. అలాగే తెలుగులోనూ అమ్మడు ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. ఇటీవలే `సరిపోదా శనివారం` అనే సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది.
చాలా రోజుల తర్వాత మీడియాలో కనిపించడంతో అమ్మడు అందంపై కామెంట్లు తెరపైకి వచ్చాయి. సన్నజాజి సోయగంలో ఉండే బ్యూటీ కాస్త బొద్దెక్కినట్లు ఉందని కామెంట్లు పడ్డాయి. అయితే ఇదే ఈవెంట్లో అమ్మడు ఓ క్లూ కూడా ఇచ్చేసింది. నటుడు శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ.. అతనితో రెండు చిత్రాలు చేసానని గుర్తు చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే శివ కార్తికేయన్ కి స్వీట్లు తినే అలవాటు ఉందని తెలిసింది.
స్వీట్లకు ఆయన బానిస. షూటింగ్ సమయంలోనే స్వీట్లు కనిపిస్తే వదలరు. ఆయనతో పాటు పక్కనున్న వారి నోట్లో కూడా స్వీట్లు పెడుతుంటారని అంది. తరచూ స్వీట్లు తినమని ఒత్తిడి కూడా చేసారని అంది. ఓ హీరో అయినా చాలా సింపుల్ గా ఉంటారని... స్వీట్లు తినే సమయంలో హీరో అనే విషయం ఆయన మర్చిపోతారని అంది. దీంతో ప్రియాంక బొద్దు రూపానికి స్వీట్లు కారణమా? అంటూ డౌట్ రెయిజ్ అవుతుంది.
రెండు సినిమాలు చేసింది కాబట్టి...శివ కార్తికేయన్ ఆమెతో ఎక్కువగా స్వీట్లు తినిపించి ఉంటాడు. అందుకే ప్రియాంక కాస్త ఒళ్లు చేసినట్లు ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బొద్దుగా మారడానికి రకరకాల కారణాలుంటాయని..కేవలం స్వీట్లు తింటేనే బరువు పెరగరని మరికొంత మంది ప్రియాంకకి మద్దతుగా నిలుస్తున్నారు.