స్కంద బిజినెస్ లో దిల్ రాజు గేమ్

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను ఆవిష్కరించారు

Update: 2023-09-21 04:27 GMT

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్కంద. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. హీరో రామ్ కూడా ఇది వరకు ఎన్నడూ కనిపించని విధంగా పవర్ ఫుల్ మాస్ లుక్ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

బోయపాటి సినిమా స్టైల్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అయిన కానీ అతని సినిమాలు ప్రేక్షకులు చూడటానికి వెళ్తారంటే పవర్ ఫుల్ ఎలివేషన్స్, అదిరిపోయే గూస్ బాంబ్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసమే. బోయపాటి చిత్రంలో ఉన్నట్లుగా యాక్షన్ సీక్వెన్స్ ఇతర సినిమాలలో కనిపించవు. పవర్ ప్యాక్డ్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మాస్ ఆడియన్స్ ఎక్కువగా బోయపాటి సినిమాలు ఇష్టపడతారు.

స్కంద మూవీ రిలీజ్ నిజానికి సెప్టెంబర్ 15 అనుకున్నారు. అయితే దిల్ రాజు రిక్వస్ట్ మేరకు మూవీ సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. అయితే కారణాలు ఏంటనేది తెలియదు కానీ ఇప్పటి వరకు మూవీ అసలు ప్రమోషన్ మొదలు పెట్టలేదు. ఇక స్కంద రిలీజ్ కి వారం రోజుల సమయం మాత్రమే ఉంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ చాలా గట్టిగా చేయాల్సి ఉంటుంది.

కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి గట్టిగా వినిపించే సౌండ్ అయితే రాలేదు. కల్ట్ మామా సాంగ్ రిలీజ్ అయిన ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాలేదు. సెప్టెంబర్ 28 రిలీజ్ విషయంలో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను ఇద్దరూ సంతృప్తికరంగా లేరంట. అయితే ఆ రోజు అయితే బిజినెస్ పరంగా బాగా వర్క్ అవుట్ అవుతుందని ఒప్పించి దిల్ రాజు వాయిదా వేయించారు.

ఈ కారణంగా దిల్ రాజుపై హీరో, డైరెక్టర్ ఇద్దరూ అసంతృప్తి ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 28న స్కందకి పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి నుంచి ఎంతో కొంత పోటీ అయితే కచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే అది బెస్ట్ టైం కాదని రామ్, బోయపాటి ఫీలింగ్. ఏది ఏమైనా రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఇకనుంచైనా ప్రమోషన్ కాస్తా స్పీడ్ చేస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News