స్కంద టార్గెట్.. రామ్ 100 కోట్ల ఆశ?

అలాగే వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా నెక్స్ట్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనేది కూడా తెలిసిపోతుంది

Update: 2023-09-28 04:17 GMT

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతోందని ట్విట్టర్ టాక్ బట్టి తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి ఫలితం ఈ రోజు ఎండ్ కి వస్తోంది. అలాగే వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా నెక్స్ట్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనేది కూడా తెలిసిపోతుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 46.20 కోట్ల బిజినెస్ చేసింది. రామ్ పోతినేని కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ స్కంద మూవీ మీద జరగడం విశేషం. ఏరియా వైజ్ గా చూసుకున్న బెస్ట్ డీల్స్ స్కంద సినిమాకి సెట్ అయ్యాయి. నైజాంలో 13 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సీడెడ్ లో 8.50 కోట్ల డీల్ సెట్ అయ్యింది. ఆంధ్రా ప్రాంతానికి 19.50 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3 కోట్లు, ఓవర్సీస్ లో 2.20 కోట్ల బిజినెస్ జరిగింది.

ఓవరాల్ గా 46.20 కోట్ల బిజినెస్ జరిగితే 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో స్కంద చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టైర్ 2 హీరోలలో నాని తర్వాత వంద కోట్లు కలెక్ట్ చేయగలిగే సత్తా స్కంద చిత్రానికి ఉంది. రామ్ పోతినేని కూడా తన ఇమేజ్ ని మరింత పెంచుకొని వంద కోట్ల స్టార్ గా మారాలని అనుకుంటున్నాడు.

దానికి తగ్గట్లుగానే ఈ సినిమాని హై స్టాండర్డ్స్ లో కంప్లీట్ గా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొనే చేశారు. ఈ సినిమాకి వచ్చే టాక్ బట్టి డబుల్ ఇస్మార్ట్ రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రామ్ పోతినేని గత సినిమాలు చూసుకుంటే ది వారియర్ మూవీ లాగ్ రన్ లో 37 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ ఎక్కువ కావడంతో డిజాస్టర్ జాబితాలో చేరింది .

దానికంటే ముందుగా చేసిన రెడ్ 35 కోట్లు కలెక్ట్ చేసిన హిట్ బొమ్మగా నిలిచింది. దీనికి కారణం సినిమా బడ్జెట్ రేంజ్ తక్కువ కావడమే. ఇస్మార్ట్ శంకర్ అయితే ఏకంగా 67 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హలో గురు ప్రేమ కోసమే 37 కోట్లు కలెక్ట్ చేసి అబౌవ్ ఏవరేజ్ గా నిలిచింది. మరి వీటిని దాటుకొని స్కంద ఏ మేరకు వంద కోట్లని అందుకోగలుగుతుంది అనేది చూడాలి.

Tags:    

Similar News