స్కంద : 72 నుంచి 84 కి పెరిగాడట
యాక్షన్ సన్నివేశాల కోసం నా ఫిజిక్ పెరగడం అవసరమని దర్శకుడు ఫీలయ్యారు. అందుకే నేను బరువు పెరిగేందుకు సిద్ధమయ్యాను.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బోయపాటి రూపొందించిన ఈ మాస్ మసాలా సినిమా కోసం రామ్ చాలా కష్టపడ్డాడట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో రామ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. 72 కేజీలను ఉన్న నేను 84 కేజీలకు పెరిగాను. అందుకోసం కఠినమైన శిక్షణ పొందాను. అలాగే చాలా క్యాలరీలు వినియోగించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
యాక్షన్ సన్నివేశాల కోసం నా ఫిజిక్ పెరగడం అవసరమని దర్శకుడు ఫీలయ్యారు. అందుకే నేను బరువు పెరిగేందుకు సిద్ధమయ్యాను. బరువు పెరిగే క్రమంలో చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లుగా కూడా రామ్ పేర్కొన్నాడు.
బరువు పెరిగినా కొద్దీ రామ్ సినిమా లోని పాత్రకు మరింత న్యాయం చేసినట్లయితే కనిపించాడు అంటూ అభిమానులు అభిప్రాయం చేస్తున్నారు. గతంలో లవర్ బాయ్ గా కనిపించిన రామ్ ఈ సినిమాలో యాక్షన్ హీరోగా మెప్పించడం ఖాయం.
బోయపాటి సినిమా అంటే యాక్షన్స్ సన్నివేశాలకు పెట్టింది పేరు. రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో శ్రీ లీలా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతుందని కూడా అంతా నమ్మకంగా ఉన్నారు. బోయపాటి అఖండ సినిమా తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.