పుష్ప 2.. తప్పు తెలిసినట్లుంది!
స్టార్ క్యాస్ట్ లేని చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు అందుకున్నాయి అంటే అది ప్రేక్షకుల చలువే.
ఈ రోజుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయితే చాలా వరకు మేకర్స్ అంత ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేయదం లేదు. జనాలకు చూడడం రాదు, లేదంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు అనడం అలవాటు అయ్యింది. ఎప్పుడైతే మిస్టేక్స్ గురించి తెలుసుకొని ఆ తర్వాత అలా జరగకుండా చూసుకుంటారో వారే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకుంటారు. స్టార్ క్యాస్ట్ లేని చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు అందుకున్నాయి అంటే అది ప్రేక్షకుల చలువే.
అంతేగాని అప్డేట్స్ వచ్చినప్పుడు వాటికి మంచి రెస్పాన్స్ రాకపోతే కూడా ఏదో ఒక కారణంతో సాకు వెతుక్కుంటే కష్టమే. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆడియెన్స్ కు నచ్చకపోతే దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఇక ఈ విషయంలో పుష్ప 2 మేకర్స్ కూడా ఇటీవల కాస్త గట్టిగానే ఆలోచించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా పుష్ప 2 కి సంబంధించిన స్పెషల్ టీజర్ విడుదల చేయగా దానికి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు.
ఫ్యాన్స్ కు అయితే మంచి కిక్ ఇచ్చింది. కానీ సినిమా వెయ్యి కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ రేంజ్ లో హైప్ అయితే సరిపోదు. ఇంకా అంతకుమించి అనేలా అప్డేట్స్ ఇంపాక్ట్ చూపించాలి. అప్పుడే సినిమా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. ఇక ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించిన అల్లు అర్జున్ సుకుమార్ కంటే ఒక అడుగు ముందుకు వేసి అప్డేట్స్ విషయంలో తను ప్రమేయం ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నట్లుగా అర్థమవుతుంది.
టీజర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది కాబట్టి అసలు ఆయుధాలను బయటకు తీయాలి అని ఆలోచనలో ఉన్నారు. ముందుగా సాంగ్స్ తో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా సరే ముందుగా సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేయగలిగితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ వచ్చినా వాటి చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి.
ఆ ఫార్మాట్లోనే ఇంతకుముందు అల.. వైకుంఠపురములో.. పుష్ప 1 విషయంలో బన్నీ ఇలానే ఆలోచించాడు. సాంగ్స్ అనేవి ఏప్పుడు వినిపిస్తూ ఉండాలి. అప్పుడే సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక నెక్స్ట్ పోస్టర్స్ టీజర్ అని కాకుండా తొందరగానే సాంగ్స్ విడుదల చేయాలని నిర్మాణ సంస్థకు ఇటీవల సూచించాడట. దీంతో దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన మొదటి పాటను విడుదల చేయడానికి పుష్ప టీమ్ నిర్ణయించుకుంది.
ఇక ఫస్ట్ సాంగ్ క్లిక్కయితే తర్వాత వచ్చే అప్డేట్స్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాయి. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సాంగ్ ప్రోమోలతో కూడా మంచి బజ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. మరి అల్లు అర్జున్ ప్రణాళికలు ఈసారి ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ లో తను కూడా బాధ్యతను తీసుకొని సలహాలు సూచనలు ఇస్తున్నట్లు అర్ధమవుతుంది.