బిగ్ బాస్ 8 ఫైనల్ ఎపిసోడ్ ఎంతమంది చూశారో తెలుసా..?

ఐతే బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ని ఎంతమంది చూశారన్నది తెలుసుకోవాలని చాలా మందికి ఉంది.

Update: 2024-12-28 07:43 GMT

బిగ్ బాస్ సీజన్ 8 పూర్తవడంతో బిగ్ బాస్ లవర్స్ అంతా కూడా బోర్ ఫీలవుతున్నారు. ఐతే షో పూర్తైనా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్టార్ మాలో వరుస షోలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ ని లాస్ట్ వీక్ సండే ఎపిసోడ్ లో తీసుకొచ్చి ఎంటర్టైన్ చేశారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ని ఎంతమంది చూశారన్నది తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. లేటెస్ట్ గా ఆ అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ని టీవీలో కన్నా ఎక్కువగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఎక్కువ వీక్షించారు.

ఈ సీజన్ మొత్తం చాలా వరకు ఓటీటీ యాప్ లోనే చూడగా ఫైనల్ ఎపిసోడ్ ని కూడా అక్కడే రికార్డ్ స్థాయిలో వీక్షించారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసొడ్ డిస్నీ హాట్ స్టర్ యాప్ లో ఏకంగా 23 మిలియన్ చూశారని తెలుస్తుంది. అంటే 2 బిలియన్ వ్యూ మినిట్స్ దాకా నమోదు అయినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇది సూపర్ రికార్డ్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

105 రోజులు కంటెస్టెంట్స్ అంతా తమ బెస్ట్ ఆటతో మెప్పించారు. ఇక ఈ సీజన్ టైటిల్ రేసు గౌతం కృష్ణ, నిఖిల్ మధ్య జరగ్గా ఫైనల్ గా నిఖిల్ మాలియక్కల్ కే బిగ్ బాస్ ఆడియన్స్ ఓటు వేశారు. గౌతం కృష్ణ వైల్డ్ కార్డ్ గా వచ్చి టాప్ 2 దాకా వెళ్లాడు. ఐతే ఈ సీజన్ లో ఎప్పుడు లేనిది తెలుగు వర్సెస్ కన్నడ అంటూ ఆడియన్స్ మధ్య అనవసరమైన చర్చ జరిగింది. కన్నడ నటుడు తెలుగు బిగ్ బాస్ గెలవడం ఏంటని కొందరు కామెంట్స్ చేశారు.

ఐతే నటుడిగా కన్నడ పరిశ్రమని వదిలి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకి ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్న వారిని ప్రాంతాలతో వేరు చేయడం కరెక్ట్ కాదు. ఐతే బిగ్ బాస్ కి వన్ సెలెక్ట్ చేశారు అంటే అది ఎవరైనా వారి ఆట తీరుని బట్టి మాత్రమే గెలుపు ఓటములను నిర్ణయించాలి కానీ భాషను బట్టి కాదు. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ని బిగ్ బాస్ టీం చాలా బాగా ఆర్గనైజ్ చేసింది. అంతేకాదు సీజన్ 7 టైం లో ర్యాలీల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడగా సీజన్ 8 గెలిచిన కంటెస్టెంట్స్ సైలెంట్ గా బయటకు వెళ్లేలా చూశారు. అందుకే అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

Tags:    

Similar News