'కల్కి' లో కనిపించని గూఢచారి
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఇంకా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సాధిస్తున్న కల్కి సినిమాలో దీపికా పదుకొనే పాత్ర చాలా స్పెషల్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు వర్షన్ లో దీపికా పదుకునే పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని మొదట భావించారు. ప్రమోషనల్ వీడియో కోసం ఆమె తో తెలుగు లో డబ్బింగ్ చెప్పించారు. కానీ అది వర్కౌట్ అవ్వదని భావించిన మేకర్స్ ఆ పాత్రకు మరెవ్వరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని భావించి హీరోయిన్ శోభిత తో చెప్పించారట.
తెలుగు అమ్మాయి అయిన శోభిత దూళిపాళ బాలీవుడ్ లో సుపరిచితురాలు. హిందీలో మంచి సినిమాలు చేసి గూఢచారి సినిమాతో టాలీవుడ్ లో కూడా హిట్ అందుకుంది. అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల ఉంటున్న శోభిత దూళిపాళ చివరకు కల్కి లో కూడా వినిపించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.
చాలా మంది కల్కి లో దీపికా పదుకునే పాత్రకు డబ్బింగ్ చెప్పింది శోభిత అనే విషయాన్ని గుర్తించలేదు. కానీ టైటిల్ కార్డ్ లో వేయడంతో పాటు, శోభిత ఆ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం తో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం శోభిత దూళిపాళ తెలుగు తో పాటు తమిళ మరియు హిందీ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇంతటి బిజీ లో శోభిత కల్కి కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తడం గొప్ప విషయం. కల్కి హాలీవుడ్ రేంజ్ మూవీ అనే ఉద్దేశ్యంతో ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాలో తాము భాగస్వామ్యం అవ్వాలని కోరుకుని మరీ అయ్యారు. మరి శోభిత కూడా అలాగే అయ్యిందేమో..!