వీడియో : పెళ్లి ఆటలో శోభితపై చైతూ గెలుపు!
అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం అత్యంత వైభవంగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం అత్యంత వైభవంగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులతో పాటు, మిత్రులు, ఇండస్ట్రీకి చెందిన వారు పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎన్నో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. అయితే అన్నింటిలోనూ నాగ చైతన్య, శోభిత పెళ్లి వస్త్రాల్లో చూడముచ్చటగా ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్, పెళ్లికి హాజరు అయిన వారు అంతా సోషల్ మీడియా ద్వారా నాగ చైతన్య, శోభితల వివాహంకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
నాగ చైతన్య ఫ్యాన్ ఫేజీలో షేర్ అయిన ఒక వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లికి సంబంధించిన ఆ వీడియోలో ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ ఆ వీడియోకి నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పెళ్లి తంతులో భాగంగా బిందెలో ఉంగరాలు వేసి పట్టుకునే ఆటను పురోహితులు నాగ చైతన్య, శోభితలతో ఆడించడం జరిగింది. ఆ పెళ్లి ఆటలో నాగ చైతన్య, శోభిత పోటీ పడి ఆడారు. వీడియోలో ఉన్నదాని ప్రకారం నాగ చైతన్య ఆ ఆటలో గెలిచాడు. శోభిత ఆ సమయంలో క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం మరింతగా ఆకట్టుకుంది.
మొత్తానికి పెళ్లి వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తూ ఉండగా ఈ వీడియో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తూ క్యూట్ వీడియోగా నిలిచింది. ఈ పెళ్లి కోసం నాగ చైతన్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య సైతం శోభితతో వివాహం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయాలతో గొప్పగా శోభిత కుటుంబ సభ్యులు ఒక మంచి ఫ్యామిలీగా నిలుస్తారని నాగ చైతన్య ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాను చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన బుజ్జి తల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సాయి పల్లవి లుక్, నాగ చైతన్య లుక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.