హీరోయిన్ ఇల్లు అమ్మకం వెనక మతలబు?
అయితే చివరి నిమిషంలో ఈ వివాహానికి హాజరైన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా మీడియా ఊహాగానాలకు చెక్ పెట్టారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా నటవారసురాలు సోనాక్షి సిన్హా ప్రేమ పెళ్లి ఇటీవల చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి పెళ్లాడిందని కథనాలొచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఈ వివాహానికి హాజరైన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా మీడియా ఊహాగానాలకు చెక్ పెట్టారు. సోనాక్షి తన తల్లిదండ్రులతో ఆ తర్వాత ఆనందంగా కనిపించింది.
ఇప్పుడు ముంబైలోని సోనాక్షి సిన్హా విలాసవంతమైన బాంద్రా అపార్ట్‌మెంట్ మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఇది నిజానికి అభిమానులలో క్యూరియాసిటీని పెంచింది. ఈ సర్ ప్రైజ్ సేల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా నటుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి ఇదే ఇంటి వద్ద పెళ్లాడింది. అందువల్ల ఈ ఇంటిని ఎందుకు అమ్ముకుంటోంది? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
రియల్ ఎస్టేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో ఆస్తికి సంబంధించిన వీడియోను షేర్ చేసి, దాని ధరను కూడా కోట్ చేసింది.
అద్భుతమైన సీఫేసింగ్ అపార్ట్ మెంట్ ఇది. బాంద్రా రిక్లమేషన్‌లోని ప్రతిష్టాత్మకమైన 81 ఆరియేట్ భవనంలో విలాసవంతమైన అపార్ట్ మెంట్ ఇది. 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఫేసింగ్ 4 BHK అపార్ట్ మెంట్ ఇది. అయితే ఇప్పుడు అది డెక్‌లతో కూడిన విశాలమైన 2 BHKగా రూపాంతరం చెందిందని తాజా పోస్ట్ వెల్లడించింది.
పూర్తిగా పునరమరికలు చేసిన, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ విలాసవంతమైన ఆస్తిని ఇప్పుడు రూ. 25 కోట్లకు సేల్ కి పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ అపార్ట్ మెంట్ ని ఇంతకుముందు సోనాక్షి కేవలం 11కోట్లకు కొనుగోలు చేసిందని, ఇప్పుడు రూపాన్ని మార్చి డబుల్ ధరకు అమ్మే ప్లాన్ లో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.