సోనాక్షి పెళ్లిపై త‌ప్పుడు ప్ర‌చారం.. షాట్‌గ‌న్ సీరియ‌స్!

బాలీవుడ్ అందాల క‌థానాయిక సోనాక్షి సిన్హా పెళ్లి గురించిన సందడి తారాస్థాయికి చేరుకుంది

Update: 2024-06-21 04:45 GMT

బాలీవుడ్ అందాల క‌థానాయిక సోనాక్షి సిన్హా పెళ్లి గురించిన సందడి తారాస్థాయికి చేరుకుంది. అయితే సోనాక్షి మ‌తాంత‌ర వివాహం కుటుంబ స‌భ్యుల‌కు న‌చ్చ‌లేద‌న్న ప్ర‌చారం ఉంది. ఈ పెళ్లికి త‌న తండ్రి శ‌త్రుఘ్న సిన్హా కానీ, త‌న త‌ల్లి, సోద‌రుడు కానీ హాజ‌రు కాబోర‌ని మీడియాలో ఊహాగానాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్‌ల పెళ్లికి సంబంధించి సిన్హా - రతాన్సీ కుటుంబాలు పెదవి విప్పని వైఖరిని కొనసాగించడంతో ఈ ఊహాగానాలు కొన‌సాగాయి. పైగా శత్రుఘ్న సిన్హా త‌న కూతురు పెళ్లి గురించి త‌న‌కు తెలియ‌ద‌ని అన‌డంతో ఆయ‌న సీరియ‌స్ గా కూతురి ప్రేమ‌పెళ్లిని వ్య‌తిరేకిస్తున్నార‌ని అంతా భావించారు. తల్లి పూనమ్ సిన్హా , సోదరుడు లవ్ సిన్హా సోనాక్షిని సోష‌ల్ మీడియాల్లో అనుసరించలేదని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి.

అయితే ఇప్పుడు సీనియ‌ర్ న‌టుడు శత్రుఘ్న సిన్హా అన్ని పుకార్లకు స్వస్తి చెప్పడానికి మీడియా ముందుకు వచ్చారు. ఇటీవలి ఇంటర్వ్యూలో వెట‌ర‌న్ నటుడు శ‌త్రుఘ్న‌ ఊహాగానాలకు తెర‌దించాడు. శత్రుఘ్న సిన్హా ఈ పుకార్లను నిర్ద్వంద్వంగా ఖండించారు. నేను పెళ్లికి తప్పకుండా హాజ‌ర‌వుతాను..నేను ఎందుకు ఉండకూడదు? సోనాక్షి సిన్హా - జహీర్ కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. వారు జంటగా చాలా అద్భుతంగా కనిపిస్తారు`` అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో శతృఘ్నకు తన కూతురిపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. ``సోనాక్షి అంటే నా గర్వం ఆనందం`` అని అతడు ప్రకటించాడు. సోనాక్షి నన్ను తన బలానికి మూలస్తంభం అని పిలుస్తుంది.. నేను అలానే ఉన్నందుకు నాకు గౌరవం ఉంది. ముంబైలో నేను ఉండటం నా మద్దతును మాత్రమే కాకుండా ఆమెకు నా రక్షణ కవచాన్ని అందించాన‌ని అర్థం. ఆమె(సోనాక్షి) సంతోషం నా ఆనందం.. భాగ‌స్వామిని ఎంచుకునే హక్కు త‌న‌కు ఉంది. భాగస్వామి తో సోనాక్షి డ్రీమ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం`` అని అన్నారు.

గాసిప్‌మాంగర్‌లను ఉద్దేశించి శ‌త్రుఘ్న సిన్హా నోరు మెదపలేదు. ``నకిలీ వార్తలను వ్యాప్తి చేసే వారు కేవలం విసుగుతో అలా రాస్తారు`` అని ఆయ‌న‌ చమత్కరించాడు. వారికి ఇదే నా హెచ్చ‌రిక‌.. ఖామోష్! దీనికంటే.. మీ స్వంత జీవితాలపై దృష్టి పెట్టండి... అని వ్యాఖ్యానించారు.

సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్ జూన్ 23న కోర్టు వివాహానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ముంబయిలోని బాస్టియన్‌లో ఒక సన్నిహిత వేడుక జరుపుకుంటారు. కాబట్టి నిశ్చింతగా శత్రుఘ్న సిన్హా తన కుమార్తె నిర్ణ‌యాన్ని స్వాగ‌తించి.. ఈ ముఖ్యమైన అడుగు వేస్తున్నందున, గ‌ర్వించే తండ్రి అయ్యాడ‌ని ఇప్పుడు అభిమానులు కీర్తిస్తున్నారు.

Tags:    

Similar News