సానియా- షోయబ్ ఆనందానికి ఐదేళ్లు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట తమ కుమారుడు ఇజాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట తమ కుమారుడు ఇజాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అక్టోబరు 30 నాటికి బాలుడికి ఐదేళ్లు నిండాయి. సానియా, షోయబ్‌లు దుబాయ్‌లో మినీ ప్రీ బర్త్‌డే వేడుకను సెలబ్రేట్ చేసారు.
సానియా తన కుమారుడు, కుటుంబ సభ్యులతో కూడిన ఫోటోల బంచ్‌ను తాజాగా పోస్ట్ చేసింది. తన లైఫ్‌లో షైనింగ్ స్టార్ కోసం సానియా ఒక భావోద్వేగ నోట్ రాసారు. ``మా జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా చుట్టూ ఎంత చీకటిగా ఉన్నా, నీ చిరునవ్వు అన్నింటినీ మెరుగుపరుస్తుంది. నీతో నన్ను ఆశీర్వధించినందుకు నేను అల్లాకు చాలా కృతజ్ఞురాలిని`` అని సానియా రాసింది. ``నిజంగా బేషరతు ప్రేమ అంటే ఏమిటో నాకు చూపించినందుకు ధన్యవాదాలు. నా హృదయం ఎప్పటికీ నా మగబిడ్డ. ప్రతి సంవత్సరం నేను నిన్ను కొంచెం దగ్గరగా హత్తుకుంటాను. ఇన్ షా అల్లాహ్ మీ అందమైన చేతులను కనుగొనడంలో సహాయం చేస్తూ నిన్ను కొంచెం గట్టిగా కౌగిలించుకుంటాను. అల్లా నిన్ను ఎల్లవేళలా ఆశీర్వధించును గాక``అని అన్నారు.
ఇజాన్ ఐదవ పుట్టినరోజున, షోయబ్ మాలిక్ బర్త్ డే వేడుకల నుండి ఫోటోల బంచ్ ను కూడా పోస్ట్ చేశాడు. ``పుట్టినరోజు శుభాకాంక్షలు బేటా. బాబా నిన్ను ప్రేమిస్తున్నారు`` అని అతడు రాశాడు. ఈ ఫోటోగ్రాఫ్స్ నేపథ్యంలో సానియా మీర్జా కూడా కనిపించింది.
పుట్టినరోజు సందర్భంగా కొడుకు ఇజాన్ కోసం షోయబ్ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ ని
సానియా షేర్ చేసారు. సానియా- షోయబ్ మాలిక్ దంపతులు 2018లో తమ మొదటి బిడ్డ ఇజాన్‌కి స్వాగతం పలికారు. ఇజాన్ చూస్తుండానే పెద్ద వాడైపోతున్నాడు. ఇప్పుడు ఐదేళ్ల కిడ్. ఇంతకుముందు ఈ జంట విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం సాగింది. కానీ దానిని వారు ఖండించిన విధానం ఆకట్టుకుంది. ఓ టెలివిజన్ షో హోస్టింగ్ కోసం ఈ ఇద్దరూ జంటగా కలిసి వచ్చారు. అనంతరం రూమర్లకు చెక్ పడింది. ఇప్పుడు తమ వారసుడి పుట్టినరోజును జంటగా కలిసి సెలబ్రేట్ చేయడం ఆసక్తికరం.