ఆ మానవతావాది తొలి సినిమా కెప్టెన్ తోనే!
బాలీవుడ్ నటుడు సోనుసూద్ అంటే తెలియని ప్రేక్షకుడు కాదు..తెలియని మనిషి అంటూ ఉండడు.
బాలీవుడ్ నటుడు సోనుసూద్ అంటే తెలియని ప్రేక్షకుడు కాదు..తెలియని మనిషి అంటూ ఉండడు. నటుడిగా కంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అంతకు మించి గొప్ప కీర్తిని తిచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ప్రభుత్వాలే చేయని గొప్ప సహాయ కార్యక్రమాలు భారత ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఇక నటుడిగా అన్ని భాషలకు సుపరిచితుడే. సినిమాల్లో విలన్ అయినా....రియల్ లైఫ్ లో మాత్రం హీరోనే.
అలాంటి నటుడి సినిమా జీవితం ఎవరితో ప్రారంభమైదో తెలుసా? అతనే కెప్టెన్ విజయ్ కాంత్. అవును విజయ్ కాంత్ హీరోగా నటించిన సినిమాతోనే సోనూసూద్ తెరంగేట్రం చేసారు. `కల్లాజగర్` అనే తమిళ సినిమాతో సోనుసూద్ తొలిసారి మ్యాకప్ వేసుకున్నారు. ఆ సినిమా 1999లో రిలీజ్ అయింది. భారతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ కాంత్ కి జోడీగా లైలా నటించింది.
ఇందులో నారాయణ్ అనే పాత్రలో సోనూసూద్ నటించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు తమిళ సినిమాల్లోనూ కొనసాగారు. అటుపై తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ తో ఉన్న అనుబంధాన్ని సోనుసూద్ మరోసారి గుర్తు చేసుకున్నారు. నా తొలి చిత్రమే విజయ్ కాంత్ తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో సలహాలు ఇచ్చేవారు.
వ్యక్తిగతంగానూ బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన సలహాలు కొనసాగాయి. ఆయనకి ఎప్పటికీ రుణపడే ఉంటాను`అని అన్నారు. ఆ రకంగా విజయ్ కాంత్ తో సోనుసూద్ అనుబంధం కొనసాగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం సోనుసూద్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాస్త తెలుగులో అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో పేరున్న హీరోలే తెలుగు వైపు చూడటంతో సోనుసూద్ రేసులో వెనుకబడుతున్నారు.