అప్పుడు రష్మిక ఇప్పుడు సోనూసూద్‌

కొన్ని నెలల క్రితం నెట్టింట వైరల్‌ అయిన రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో మరవక ముందే సోనూ సూద్ యొక్క డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది.

Update: 2024-01-20 06:12 GMT

పెరిగిన టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. కొందరు ఆకతాయిలు హీరోయిన్స్ ఫేక్ వీడియోలను క్రియేట్‌ చేసి రాక్షస ఆనందం పొందుతూ ఉంటే, కొందరు సెలబ్రిటీల యొక్క ఫేక్ వీడియోలను క్రియేట్‌ చేసి డబ్బులు దండుకునే మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక చోట సైబర్‌ నేరాలు జరుగుతూనే ఉన్నాయి.

కొన్ని నెలల క్రితం నెట్టింట వైరల్‌ అయిన రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో మరవక ముందే సోనూ సూద్ యొక్క డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది. సోనూసూద్‌ కి ఉన్న మంచి పేరును వాడుకుని సైబర్ నేరగాల్లు డబ్బులు వసూళ్లు చేసేందుకు ఆ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై సోనూ సూద్‌ స్వయంగా స్పందించాడు. డీప్‌ ఫేక్ వీడియో టెక్నాలజీతో కొందరు తన ఫేస్‌ ను వినియోగించి వీడియో కాల్స్ చేసి డబ్బులు అడుగుతున్నారని తెలిసింది. ఎవరు కూడా వాటికి స్పందించవద్దు అంటూ సోనూసూద్‌ విజ్ఞప్తి చేశాడు. తన పేరుతో డబ్బులు వసూళ్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను అంటూ సోనూసూద్‌ పేర్కొన్నాడు.

కరోనా సమయంలో రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ కి ఉన్న మంచి పేరును, ఆయన ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నేరగాళ్లు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి డబ్బులు దండుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది అక్కడ ఉన్నది సోనూసూద్‌ అని నమ్మి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.

ఇలాంటి ఫేక్ వీడియోల గురించి ఎంతగా ప్రచారం చేసినా కూడా కొందరు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. సోనూసూద్‌ వంటి స్టార్‌ చిన్న చిన్న మొత్తాని ఇవ్వమంటూ ఎవరిని అడగడు అనే విషయాన్ని కూడా గుర్తించకుండా చాలా మంది మోసపోవడం విడ్డూరంగా ఉంది.

Tags:    

Similar News