ప‌ద్మ శ్రీకి కూడా ఆయ‌న అన‌ర్హుడా!

బాలీవుడ్ న‌టుడు సోనుసూద్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్ధా లుగా న‌టుడిగా కొన‌సాగుతున్నారు.

Update: 2024-01-26 06:11 GMT

బాలీవుడ్ న‌టుడు సోనుసూద్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్ధా లుగా న‌టుడిగా కొన‌సాగుతున్నారు. హిందీ..తెలుగు తో పాటు క‌న్న‌డ‌..మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తు న్నారు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఏర్ప‌రుచుకున్నారు. ఇదంతా ఆయ‌న వృత్తిగ‌త జీవిత‌మైతే వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న క‌రోనా ( 2019 కోవిడ్) స‌మ‌యంలో అందించిన సేవ‌ల గురించి మాట‌ల్లో చెప్ప‌లేనిది.

క‌రోనా స‌మ‌యంలో దేశంలోనే గొప్ప సేవ‌లందించి త‌న‌లో మాన‌వ‌తా దృక్ఫ‌దాన్ని తొలిసారి బ‌య‌ట‌కు తెచ్చారు. ప్ర‌భుత్వాలు సైతం చేయ‌ని స‌హాయ‌న్ని సోనుసూద్ సొంత డ‌బ్బు స‌మ‌కూర్చుకుని చేసారు. వ‌ల‌స కార్మికుల విష‌యంలో ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌ల గురించి ప్ర‌తీ పౌరుడు ఎంతో గ‌ర్వించాడు. సొతంగా వివిధ రాష్ట్రాల‌కు బస్సులు వేసి వ‌లస కార్మికుల్ని త‌మ సొంత రాష్ట్రాల‌కు త‌రలించిన ఒకే ఒక్క‌డు సోను సూద్.

ఇలా సేవ‌లు అందించ‌డంలో అప్ప‌ట్లో సోనుసూద్ పై రాజ‌కీయ కోణం కూడా ఉంద‌నే విమ‌ర్శ‌లు అధికార పక్షం తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇందులో వాస్త‌వం ఎంతో తెలియ‌దు గానీ..సోను సూద్ మాత్రం ఆయ‌న చేసిన సేవ‌లు మాత్రం చిర‌స్మ‌ర‌ణీయం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ఆయ‌న చూపిన చోర‌వ ప‌ట్ల అంతా హ‌ర్షించారు. ఇప్ప‌టికీ ఆయ‌న సేవ‌లు నిర్విరామంగా కొన సాగుతున్నాయి. సొంతంగా చారిటీ ట్ర‌స్టుల్ని ఏర్పాటు చేసి సేవ‌లందిస్తున్నారు.

వ్య‌క్తిగ‌తంగా స‌హాయం అనే మాట ఆయ దృష్టికి చేరిందంటే త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తారు. మ‌రి అలాం టి గొప్ప వ్య‌క్తి ప‌ద్మ శ్రీ ప్రాథ‌మిక అవార్డుకి కూడా అన‌ర్హుడా? అంటే అవున‌నే అనాలి. తాజాగా కేంద్ర ప్ర‌భు త్వం ప‌ద్మ అవార్డుల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 2024కి గానూ భార‌త ప్ర‌భుత్వం మొత్తం 110 మంది కి ప‌ద్మ శ్రీల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ఈ అవార్డులు ప్ర‌క‌టించారు. అయితే మ‌రోసారి సోనుసూద్ కి ఈ విష‌యంలో నిరాశే ఎదురైంది.

ఆయ‌న సేవ‌ల్ని గుర్తించి ఈ ఏడాది క‌నీసం ప‌ద్మ శ్రీతోనైనా ప్ర‌భుత్వం స‌త్కరిస్తుంద‌ని ఆయ‌న అభిమా నులు స‌హా చాలా మంది ప్రేక్ష‌కులు భావించారు. కానీ మ‌రోసారి నిరాశ త‌ప్ప‌లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు నిరుత్సాహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్రాధ‌మిక అవార్డుకు కూడా సోనుసూద్ అన ర్హుడా? అంటూ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సోనుసూద్ కోవిడ్ సేవ‌ల్ని ప్ర‌భుత్వం గుర్తించ‌లేదంటూ అభిమానులు మండిప‌డుతున్నారు.




Tags:    

Similar News