మార్కెట్ లో పాన్ ఇండియా భామ‌ల రేంజ్ ఎంత‌?

సౌత్ నుంచి పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన భామ‌లెంత మంది? వాళ్లిప్పుడు ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మార్కెట్ లో వాళ్ల రేంజ్ ఎంత‌?

Update: 2023-12-15 03:00 GMT

సౌత్ నుంచి పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన భామ‌లెంత మంది? వాళ్లిప్పుడు ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మార్కెట్ లో వాళ్ల రేంజ్ ఎంత‌? అంటే చాలా సంగ‌తులే తెలుస్తున్నాయి. ఇటీవ‌లే 'జ‌వాన్' తో బాలీవుడ్ లోనూ ఫేమ‌స్ అయింది న‌య‌న‌తార‌. అప్ప‌టికే సౌత్ లో త‌న బ్రాండ్ వేసిన అమ్మ‌డికి 'జ‌వాన్' లాంటి స‌క్సెస్ పాన్ ఇండియాలో ఎన‌లేని క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడీ భామ‌తో బాలీవుడ్ లో హీరోలంతా ప‌నిచేయ‌డానికి రెడీ గా ఉన్నారు.

'జ‌వాన్' కు గానూ లేడీ సూప‌ర్ స్టార్ ప‌ది కోట్ల‌కు పైగానే పారితోషికం తీసుకుంద‌ని స‌మాచారం. ఇక‌పై ఈ భామ ఏ భాష‌లో సినిమా చేయాలి? అన్న ప‌ది కోట్ల‌కు పైగానే ఛార్జ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న 'పుష్ప‌'తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఆపై బాలీవుడ్ లో రెండు సినిమాలు ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌న‌ప్ప‌టికీ ఇటీవ‌ల రిలీజ్ అయిన 'యానిమ‌ల్' తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. 1000 కోట్ల క్ల‌బ్ లో చేరితే రష్మిక రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

'యానిమ‌ల్' కి గానూ ర‌ష్మిక భారీ రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేయ‌న‌ప్ప‌టికీ ఈ సినిమా ఆమె స్థాయిని మార్చింది. ఇక‌పై ఏ సినిమాకి సైన్ చేయాల‌న్నా? 10 కోట్ల‌కు పైగానే తీసుకునే అవ‌కాశం ఉంది. ఇక స‌మంత బాలీవుడ్ ప్ర‌య‌త్నాలు ఇప్పుడే మొద‌లు పెట్టిన‌ప్ప‌టికీ 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో నార్త్ లో ఇప్ప‌టికే ఫేమ‌స్ అయింది. అదే ఐడెంటిటీతో అక్క‌డ అవ‌కాశాలు అందుకుంటుంది. సామ్ ఒక్కో సినిమాకి 5 కోట్లకు పైగానే తీసుకుంటుంది.

'సీటాడెల్' వెబ్ సిరీస్ గ‌నుక స‌క్సెస్ అయితే స‌మంత రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అయిపోతుంది. సినిమాల్ని మించిన పారితోషికం వెబ్ సిరీస్ ల ద్వారానే తీసుకుంటుంది. ఇక అందాల త్రిష వ‌య‌సు మీద ప‌డుతున్నా అమ్మ‌డి క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇటీవ‌లే మ‌ణిర‌త్నం 'పొన్నియ‌న్' సెల్వ‌న్ లో న‌టించి పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయింది. అటుపై రిలీజ్ అయిన 'లియో' కూడా అమ్మ‌డి రేంజ్ ని రెట్టింపు చేసింది. ఈ రెండు సినిమాల‌కు గాను 10 కోట్ల‌కు పైగానే పారితోషికం తీసుకుంద‌ని స‌మాచారం.

ఇక మిల్కీబ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ ఛాన్సులు త‌గ్గినా ఐటం పాట‌ల‌కి సైన్ చేసే కోట్ల రూపాయల ఆదాయం చూస్తుంది. హీరోయిన్ క్రేజ్ స‌హా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని అమ్మ‌డు ఒక్కో సినిమాకి 5 నుంచి 6 కోట్ల వ‌ర‌కూ డిమాండ్ చేస్తుందిట‌. అలాగే కీర్తి సురేష్‌..అనుష్క శెట్టి లాంటి భామ‌లు 2023లో అధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ల జాబితాలో నిలిచారు.

Tags:    

Similar News