నయన్ నుంచి శ్రీలీల వరకు.. ఎవరి పారితోషికం ఎంత?
అక్కడి హీరోయిన్స్ అయిదు నుంచి పది కోట్ల పారితోషికాలు అందుకుంటూ ఉంటారు. అయితే సౌత్ హీరోయిన్స్ విషయానికి వస్తే ఇక్కడ టాప్ హీరోయిన్ పారితోషికం అయిదు కోట్లకు మించడం గొప్ప విషయంగా ఉంది.
బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా హీరోల పారితోషికంతో పోల్చితే హీరోయిన్ ల పారితోషికాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే గతంతో పోల్చితే వ్యత్యాసం తగ్గింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్ అంటే చాలా గొప్ప విషయం.
సౌత్ హీరోయిన్స్ తో పోల్చితే ఉత్తరాది ముద్దుగుమ్మలు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు. అక్కడి హీరోయిన్స్ అయిదు నుంచి పది కోట్ల పారితోషికాలు అందుకుంటూ ఉంటారు. అయితే సౌత్ హీరోయిన్స్ విషయానికి వస్తే ఇక్కడ టాప్ హీరోయిన్ పారితోషికం అయిదు కోట్లకు మించడం గొప్ప విషయంగా ఉంది.
సోషల్ మీడియా ప్రచారం, ఇతర మీడియా కథనాల అనుసారం సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా చాలా కాలంగా నయనతార కొనసాగుతోంది. ఈమె చేసే ప్రతి లేడీ ఓరియంటెడ్ సినిమాకు కూడా రూ.5 కోట్లు తగ్గకుండా పారితోషికం తీసుకుంటూ ఉంది. జవాన్ సక్సెస్ తో ఆమె పారితోషికం ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదు.
నయనతార తర్వాత టాలీవుడ్ మరియు కోలీవుడ్ హీరోయిన్స్ పలువురు రెండు నుంచి మూడు నాలుగు కోట్ల మధ్య లో పారితోషికం తీసుకుంటూ ఉంటారు. వారు ఎంపిక చేసుకునే కథ, మరియు పాత్రల ఆధారంగా పారితోషికం ఉంటుంది. సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే ఇంకా కాజల్ అగర్వాల్ లు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ను అందుకుంటూ ఉన్నారు.
ఇక రీసెంట్ సెన్షేషన్ అయిన శ్రీలీల కూడా కోటి క్రాస్ చేసింది. ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తున్న శ్రీలీల భారీ పారితోషికం ను తన ఖాతాలో వేసుకుంటూ ఉంది. భగవంత్ కేసరి వరకు ఆమె పారితోషికం కోటి నుంచి కోటిన్నర వరకు పలుకుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె పాత్రను బట్టి రెండు కోట్ల వరకు కూడా డిమాండ్ చేస్తుందని సమాచారం అందుతోంది.
ఒకప్పుడు కోటిని క్రాస్ చేసిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు మహా అయితే అయిదుగురు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో హీరోయిన్స్ కోటి కి మించిన పారితోషికం తీసుకుంటున్నారు. ఒక్క సూపర్ హిట్ పడితే చాలు నిర్మాతలు ఆయా హీరోయిన్స్ పారితోషికం భారీగా పెంచేస్తున్నారు.
ఆమధ్య ఉప్పెన తో విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టికి తక్కువ సమయంలో కోటి పారితోషికం దక్కింది. అయితే విజయాలు లేకుంటే, వరుస ఫ్లాప్స్ బారిన పడితే పారితోషికాలు సగానికి సగం తగ్గినా ఆశ్చర్యం లేదు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని హీరోయిన్స్ హిట్ కొడితే పారితోషికం పెంచేస్తారు.