వర్మ మేనకోడలు శ్రీకాంత్ లవ్ లో !
తాజాగా శ్రావ్య-బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ నిశ్చితార్దం చేసుకున్నారు. త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు.
సంచలనాల రాంగోపాల్ వర్మకు ఓ అందమైన మేనకోడలు ఉందని ఎంత మందికి తెలుసు. ఆమె నిర్మాత అని కూడా ఎంత మందికి తెలుసు? ఇప్పుడామె ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని వివాహం చేసుకుంటుంది. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. వివరాల్లోకి వెళ్తే...ఆమె పేరు శ్రావ్యవర్మ. వర్మ దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో మేనకోడలని నిర్మాతగా పరిచయం చేసారు. అలాగే శ్రావ్య కాస్ట్యూమ్ డిజైనర్ కూడా.
దేవదాస్, చిలసౌ, మ్యాస్ట్రో లాంటి సినిమాలకు డిజైనర్ గానూ పనిచేసింది. ఇటీవల రిలీజ్ అయిన కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖీ' సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించింది. ఆ రకంగా శ్రావ్య ఇండస్ట్రీ జనాలకు బాగా సుపరిచితం. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారికి ఆమె డిజైన్ అని తెలుస్తుంది.
తాజాగా శ్రావ్య-బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ నిశ్చితార్దం చేసుకున్నారు. త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. అయితే వీరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన సంబంధమా? అన్నది తెలియాలి.ప్రేమ వివాహం అన్నట్లు ఎక్కడా ప్రచారంలో లేదు. మరి ఆ సంగతేంటో తేలాలి. అలాగే మేనకోడలు పెళ్లి చేసుకోవడంపై వర్మ రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో చూడాలి.
ఎందుకంటే వర్మ వివాహ వ్యవస్తకు వ్యతిరేకం. తాను తెలియక వివాహం చేసుకున్నానని, అప్పుడే అంత మెచ్యూర్టీ ఉంటే పెళ్లి చేసుకునే వాడిని కాదని నేటి జనరేషన్ కి క్లాస్ లు పీకుతుంటాడు అన్నది తెలిసిందే. మరి తన అనుభవాన్ని, అనుభూతుల్ని వర్మ తన మేనకోడలిపై రుద్దినట్లు లేదు. ఆసంగతి పక్కన బెడితే శ్రావ్య ఎంగేజ్ మెంట్ తో ఆమెకి సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలంతా విషెస్ తెలియజేస్తున్నారు.