వెస్ట్రన్ లుక్స్ తో మెరిసిపోతున్న శ్రీలీల

ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. డిసెంబర్ లో ‘రాబిన్ హుడ్’ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

Update: 2024-10-27 04:45 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల మంచి కమర్షియల్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. డాన్స్, యాక్టింగ్ తో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఖాతాలో ఇప్పటి వరకు ‘ధమాకా’ రూపంలో ఒకే ఒక్క హిట్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీల నటించింది. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో శ్రీలీలకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆమె నితిన్ కి జోడీగా ‘రాబిన్ హుడ్’ మూవీలో నటించింది.

ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. డిసెంబర్ లో ‘రాబిన్ హుడ్’ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే రవితేజతో మరోసారి శ్రీలీల జతకట్టింది. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రొడక్షన్ దశలోనే ఉంది. తమిళంలో కూడా ఓ సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది. ఇలా శ్రీలీల చేతిలో సినిమాలు ఉన్న కూడా ఆమె సక్సెస్ రేట్ తక్కువగా ఉండటంతో పెద్దగా ఎవరి ఫోకస్ లేదు.

అయితే శ్రీలీలలో మంచి కమర్షియల్ హీరోయిన్ అని ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ దక్కింది. ఆమె డాన్స్ టాలెంట్ కి మహేష్ బాబు ఫిదా అయిపోయాడు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు గ్లామరస్ పిక్స్ కూడా పంచుకుంటుంది. శ్రీలీలకి ఇన్ స్టాగ్రామ్ లో 6.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

అందుకే ఒక్క ఫోటో పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ స్కర్టులో ఉన్న గ్లామరస్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ తో మెరిసిపోతోంది. వెస్ట్రన్ స్టైల్ అవుట్ ఫిట్ లో అదిరిలోయ్ ఫోజులుతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీలీల కళ్ళు చూసి ఎవరైనా ఫ్లాట్ అయిపోతారని ఆమె ఫ్యాన్స్ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News