ఇంత బోల్డ్ గా మాట్లాడొద్దు శ్రీలీల...!
మహేష్ బాబు కు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది.
టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త 'పెళ్లి సందడి' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. మొదటి సినిమా డిజాస్టర్ అయినా కూడా లక్కీగా టాలీవుడ్ లో మంచి ఆఫర్లు దక్కాయి. ధమాకా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల శ్రీలీల ఒకే సారి డజను సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది.
మహేష్ బాబు కు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో స్లో అయిన శ్రీలీల మళ్లీ స్పీడ్ పెంచింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు అయిదు సినిమాలు ఉన్నాయట.
కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. కన్నడంలో ఈ అమ్మడికి పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వస్తున్నాయని సమాచారం అందుతోంది. మొత్తానికి శ్రీలీల బిజీ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు ఒక చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలను వెళ్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కెరీర్ లో ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, మీరు పాటించే ప్రణాళికలు ఏంటి అన్నట్టుగా ప్రశ్నించిన సమయంలో అలాంటివి ఏమీ లేవు అన్నది. భవిష్యత్తు గురించి పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు ని ప్లాన్ చేయడం అనేది నాకు తలకు మించిన భారం.
అందుకే అలాంటి భారంను మోయకుండా ప్రస్తుతంను ఎంజాయ్ చేస్తాను. ఇప్పటికిప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచిస్తాను. అందుకే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తాను. సినిమాల పట్ల నాకు ఉన్న అభిరుచి, నా ఆసక్తులతో పాటు నా డాన్స్ నన్ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాయంది. అయితే కొందరు మాత్రం ఈమె మాటలను తప్పుబడుతున్నారు.
మరీ ఇంత బోల్డ్ గా మాట్లాడటం సరి కాదు. నేను చాలా కష్టపడ్డాను, చాలా వ్యూహాత్మకంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సినిమాలు చేస్తున్నాను అన్నట్లుగా ఇతర హీరోయిన్స్ మాదిరిగా చెప్పాలంటూ శ్రీలీల ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియా ద్వారా హితవు పలికే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి మాటలను ఈ అమ్మడు పట్టించుకుంటుందా అనేది చూడాలి.
సినిమా ఇండస్ట్రీలో వ్యూహాల కంటే అనూహ్య పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వేటికి అయినా సిద్ధం అన్నట్టుగా ఉండాలి, ప్రతి అవకాశం ను సద్వినియోగం చేసుకోవడం కోసం కష్టపడాలని కొత్త వారికి శ్రీలీల సలహాలు ఇచ్చింది. ఇటీవలే ఈ అమ్మడు రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఎంపిక అయ్యింది. మరో వైపు పవన్ మూవీలో కూడా ఈ అమ్మడు నటించబోతున్న విషయం తెల్సిందే.