దర్శకుడితో శ్రీలీల పర్సనల్ రిలేషన్!
సినిమా విడుదల సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి మరియు హీరోయిన్ శ్రీలీల గురించి ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ అనగానే ఎక్కువ శాతం మంది శ్రీలీల పేరునే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అంతటి క్రేజ్ మరియు అంతటి స్టార్ డమ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో వరుస సినిమాల తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న శ్రీలీల పర్సనల్ విషయాల వల్ల కూడా వార్తల్లో ఉంటుంది.
శ్రీలీల చేతిలో ప్రస్తుతం పది ఉన్నాయి. అందులో అర డజను సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి. కొన్ని సినిమాల షూటింగ్ లు పూర్తి అవ్వగా కొన్ని సినిమాల షూటింగ్ లు ఇంకా మొదలు అవ్వలేదు. ప్రస్తుతం అందరి దృష్టి కూడా శ్రీలీల కీలక పాత్ర లో నటించిన బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమా పై ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
శ్రీలీల కూడా ఆ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. నటిగా శ్రీలీలకు ఆ సినిమా కచ్చితంగా మంచి గుర్తింపును తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ శ్రీలీల పాత్రను డిజైన్ చేశాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కనుక నటిగా ఈ సినిమా శ్రీలీలకి మంచి గుర్తింపును తెచ్చ పెడుతుందట.
సినిమా విడుదల సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి మరియు హీరోయిన్ శ్రీలీల గురించి ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు అనిల్ ని శ్రీలీల మామ అంటూ పిలిచేదట. సెట్ లో అందరు ఉన్నప్పుడు సర్ అంటూ పిలిచి... పర్సనల్ గా మాత్రం మామ అంటూ పిలిచేదట. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండే వారని చూసిన వారు చెబుతున్నారు.
శ్రీలీల తల్లి ఊరు మరియు అనిల్ రావిపూడి ఊరు ఒకటే. పుట్టి పెరిగింది మొత్తం కూడా బెంగళూరులో అయినా కూడా శ్రీలీల ఏడాదికి ఒకటి రెండు సార్లు తప్పకుండా తన అమ్మమ్మ ఇంటికి వచ్చేది. అలా దర్శకుడు అనీల్ రావిపూడితో సాన్నిహిత్యం ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. పైగా శ్రీలీల తల్లి మరియు అనిల్ రావిపూడి కజిన్స్ అవుతారట.
అందుకే శ్రీలీల అనిల్ ను మామ అని పిలుస్తుందని అంటున్నారు. తల్లి ద్వారా ఏర్పడిన రిలేషన్ తప్ప.. ఇద్దరి మధ్య అంతకు మించి ఏమీ లేదు అనేది కొందరి మాట. మొత్తానికి శ్రీలీల మామ అంటూ అనిల్ ని సంభోధించడం చర్చనీయాంశం గా మారింది. ఇద్దరిలో ఎవరైనా ఈ విషయమై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.