ప్లాప్ రిజల్ట్ తర్వాత శ్రీకాంత్ కి అలాంటి ఓదార్పు!
తొలి షో టాక్ తోనే డిజాస్టర్ అని తేలిపోయింది. మహేష్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ అని తీవ్ర విమర్శలు తెచ్చిన చిత్రంగా బ్రహ్మోత్సవం నిలిచింది
మహేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన 'బ్రహ్మోత్సవం' ఎలాంటి డిజాస్టరో తెలిసిందే. శ్రీకాంత్ గత విజయాలు..'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి హిట్ సినిమా చూసి మహేష్ అవకాశం ఇస్తే చేసిన సినిమా అది. భారీ తారాగణంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. రిలీజ్ కి ముందు మ్యూజికల్ గా మంచి విజయం సాధించింది. కానీ విడుదల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.
తొలి షో టాక్ తోనే డిజాస్టర్ అని తేలిపోయింది. మహేష్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ అని తీవ్ర విమర్శలు తెచ్చిన చిత్రంగా బ్రహ్మోత్సవం నిలిచింది. ఆ ప్లాప్ తర్వాత శ్రీకాంత్ కి అవకాశం రావడానికి ఐదేళ్లు సమయం పట్టింది. బ్రహ్మోత్సవం ఆ ఇద్దరిపై అంత ప్రభావాన్ని చూపింది. తాజాగా 'పెదకాపు' రిలీజ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న శ్రీకాంత్ ...బ్రహ్మోత్సవం ప్లాప్ గురించి స్పందించారు. ఆసినిమా పరాజయం నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి తనకెలాంటి ఓదార్పు దక్కిందో రివీల్ చేసారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
'బ్రహ్మోత్సవం' ఫ్లాప్ కి నేనే కారకుడిని. స్క్రిప్ట్ పరమైన పొరపాటు కారణంగానే పరాజయం ఎదురైంది. దీంతో సినిమా ఎందుకు ప్లాప్ అయిందని సీరియస్ గా ఆలోచించాను. సుదీర్ఘమైన పరిశీలన చేసాను. అప్పుడే తప్పంతా నాదే అని అర్దమైంది. నేను ఏది అయితే నమ్మానో? అదే మిస్ పైర్ అయిందని గుర్తించాను.థియేటర్స్ నుంచి టాక్ బయటికి రాగానే ముందుగా నాకు ఈశ్వరీరావు కాల్ చేశారు.
'మీలో చాలా టాలెంట్ ఉంది .. అధైర్యపడకండి' అన్నారు. ఆ తరువాత అల్లు అరవింద్ గారు 'ఎమోషన్స్ ను గొప్పగా చూపించే దర్శకులలో మీరు ఒకరు .. మరోసారి పెద్ద హిట్ ఇస్తారు' అన్నారు. ఇక మహేశ్ బాబు గారు 'ఒక్కోసారి అలా జరుగుతుంటాయి' అన్నారు. అలా ఆ ముగ్గురు ఆ సమయంలో నాకు మద్దతుగా నిలబడ్డారు. వాళ్లు అలా నిలబడటం నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది' అని అన్నారు.