సాంగ్స్ కోసమే అంత ఖర్చు చేశారట

సినిమాకి పెట్టిన ప్రతి పైసా కూడా ట్రైలర్ లో కనిపిస్తోంది.షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది

Update: 2023-09-06 04:40 GMT

షారుఖ్ ఖాన్ హీరోగా అత్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జవాన్. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. మరొక్క రోజులో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రం రాబోతోంది. భారీ బడ్జెట్ తో రెడ్ చిల్లీస్ బ్యానర్ లో షారుఖ్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రికార్డుస్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టేలా కనిపిస్తోంది.

తమిళనాడులో కూడా మొదటిసారిగా ఒక డబ్బింగ్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ నడుస్తున్నాయి. దీనికి కారణం సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటమే. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. మూవీపైన పాజిటివ్ బజ్ ఉంది.

సినిమాకి పెట్టిన ప్రతి పైసా కూడా ట్రైలర్ లో కనిపిస్తోంది.షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రంలో సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనే టాక్ వస్తోంది. అనిరుద్ మొదటిసారిగా ఒక హిందీ సినిమాకి జవాన్ తో వర్క్ చేసినట్లు అయ్యింది. ఈ సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక సాంగ్స్ చిత్రీకరణ కోసం అత్లీ ఏకంగా 36 కోట్ల వరకు ఖర్చు చేసారంట.

ఇది సౌత్ లో ఒక మినిమమ్ రేంజ్ మూవీ బడ్జెట్. సౌత్ లో సాంగ్స్ కి అత్యధికంగా ఖర్చు చేసే దర్శకుడిగా శంకర్ ఇప్పటి వరకు ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీలో సాంగ్స్ కోసం కూడా శంకర్ భారీగానే ఖర్చు చేయిస్తున్నారు. అయితే అత్లీ మాత్రం జవాన్ సాంగ్స్ విషయంలో శంకర్ ని దాటిపోయారని చెప్పాలి. ఇంత మొత్తంలో సాంగ్స్ కోసం ఖర్చు చేశారంటే కచ్చితంగా గ్రాండియర్ గా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.

సినిమాలో దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. నయనతార పోలీస్ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది.షారుఖ్, నయనతార మధ్య కూడా డ్యూయెట్ సాంగ్ ఉంది. అయితే ఇది ఏ సందర్భంలో వస్తుందనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News