మహేష్- రాజమౌళి సినిమాలో బాలీవుడ్ స్టార్?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన RRR సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన RRR సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది టాలీవుడ్ - బాలీవుడ్ - హాలీవుడ్ స్టార్ల కలయికలో భారీ మల్టీస్టారర్ గా రూపొందింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ - ఎన్టీఆర్ లాంటి ట్యాలెంట్ ని ఎంపిక చేసుకున్న రాజమౌళి తెలివిగా బాలీవుడ్ నుంచి ఒక స్ఫర్తివంతమైన స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర కోసం అజయ్ దేవగన్ ని ఎంపిక చేసుకున్నారు. ఆంగ్లేయుల పాత్రల కోసం పలువురు హాలీవుడ్ స్టార్లను రాజమౌళి సెలెక్ట్ చేసారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాను సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించనున్న SSMB కోసం ఉపయోగిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఈసారి కూడా ఈ మూవీలో హిందీ స్టార్లు, హాలీవుడ్ స్టార్లు నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించేందుకు ఆస్కారం ఉందని కూడా గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ కి అజయ్ దేవగన్ ఎంత కీలకం అయ్యాడో అలానే మహేష్ మూవీకి అమీర్ పాత్ర అంతే కీలకం కానుందనేది తాజా గుసగుస. అయితే దీనిని ఇటు రాజమౌళి బృందాలు ఇంకా ఖరారు చేయలేదు.
ఇక తన ఫేవరెట్ స్టార్ అమీర్ ఖాన్ ని రాజమౌళి సంప్రదించారా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు RRR చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన పార్టీలో చిత్రబృందాన్ని అభినందించేందుకు బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, జావేద్ అక్తర్, అయాన్ ముఖర్జీ, జీతేంద్ర వంటి ప్రముఖులు విచ్చేశారు. అనంతరం అమీర్ ఖాన్ RRR పై ప్రశంసల వర్షం కురిపించారు. అప్పటికి లాల్ సింగ్ చడ్డా పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ ఆర్.ఆర్.ఆర్ ని చూడలేకపోయానని అన్నారు.
ఆర్.ఆర్.ఆర్ విజయం గురించి విన్నానని, ఈ విజయానికి చాలా సంతోషంగా ఉందని అమీర్ ఖాన్ అప్పట్లో అన్నారు. నేను ఆర్.ఆర్.ఆర్ టీమ్‌ని కలిశాను. వారి ప్రయాణంలో చివరి దశలో వారితో స్నేహితుడిగా కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి చాలా మంచి స్పందన వచ్చింది. ఎవరైనా సినిమాను ప్రశంసించిన ప్రతిసారీ నేను రాజమౌళి జీ అని పిలుస్తాను. అతని వాయిస్‌లో ఆనందాన్ని నేను వింటాను.. అని అమీర్ అన్నారు. దీనిని బట్టి రాజమౌళి అంటే అమీర్ ఖాన్ కి అపారమైన గౌరవం ఉంది. అలాగే అమీర్ ఖాన్ అంటే రాజమౌళికి గొప్ప గౌరవం.. అభిమానం. అందువల్ల మహేష్- అమీర్ ఖాన్ కాంబినేషన్ సాధ్యమేనని అభిమానులు ఊహిస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా తర్వాత చాలా గ్యాప్ తీస్కున్న అమీర్ ఖాన్ తన బ్లాక్ బస్టర్ మూవీ తారే జమీన్ పర్ సీక్వెల్ పై దృష్టి సారించారని కథనాలొచ్చాయి. అమీర్ తదుపరి స్టెప్ ఏమిటన్నదానిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.