ఎస్ ఎస్ ఎంబీ 29 ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

తొలి షెడ్యూల్ హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స‌మీపంలోనూ అల్యుమిన‌యం ఫ్యాక్ట‌రీలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది.

Update: 2024-04-23 10:38 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్- రాజమౌళి కాంబినేష‌న్ లో పాన్ ఇండియా చిత్రానికి స‌మాయ‌త్త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. వేస‌వి పూర్త‌వ్వ‌గానే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్యాకెండ్ వర్క్ అంతే వేగంగా జ‌రుగుతోంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి లీకైంది. తొలి షెడ్యూల్ హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స‌మీపంలోనూ అల్యుమిన‌యం ఫ్యాక్ట‌రీలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ సినిమాకి సంబంధించి కొన్ని భారీ సెట్లు నిర్మిస్తున్నారుట‌. ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో సెట్ట నిర్మాణం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

అల్యుమినియం ఫ్యాక్ట‌రీతో రాజ‌మౌళితో విడ‌దీయ‌రాని బంధం. ఆయ‌న ఏ సినిమా షూటింగ్ చేసినా అక్క‌డ త‌ప్ప‌కుండా సెట్లు నిర్మించి పనిచేస్తుంటారు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' చిత్రాల‌కు అలాగే చేసారు. ఆ స్పాట్ నే త‌న సొంత ఇంటిగానే మ‌లుచుకున్నారు. సెట్స్ ప‌క్క‌నే ర‌మారాజమౌళి ఉండేందుకు వీలుగా చిన్న గెస్ట్ హౌస్ ని కూడా నిర్మించుకుని అక్క‌డ షూట్ మొత్తం పూర్త‌య్యేవ‌ర‌కూ ఉన్నారు. తాజాగా మ‌హేష్ సినిమా కోసం అక్క‌డే ఉంటార‌ని తెలుస్తోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ కంటే ముందు థీమ్ షూట్ ఒక‌టి చేయాల్సి ఉంది.

అది అల్యుమినియం ఫ్యాక్ట‌రీలోనూ షూట్ చేస్తారు. అలాగే స్టోరీ డిస్కష‌న్ కి సంబంధించి దుబాయ్ లో రాజ‌మౌళి-మ‌హేష్ మ‌ధ్య డిస్క‌ష‌న్ కూడా జ‌రిగింది. అయితే అక్క‌డ భారీ వ‌ర‌ద కార‌ణంగా మ‌ధ్య‌లో ఉండిపోయింది.

ఆ ప‌నులిప్పుడు హైద‌రాబాద్ లో ముగించ‌నున్నారు. అలాగే అవ‌స‌ర‌మైన వ‌ర్క్ షాప్ లు కూడా నిర్వహించాల్సి ఉంది. ఇవ‌న్నీ కూడా స‌మ్మ‌ర్ పూర్తయ్యే లోపు పూర్తి చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఆ ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మే ముగింపుక‌ల్లా ఆ ప‌నులన్నీ పూర్త‌వుతాయ‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.

జూన్ చివ‌ర్లో గానీ...జులై మొద‌టి వారంలో గానీ షూట్ కి సంబంధించి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంద‌ని తెలిసింది. ఈలోపు ఏపీలో ఎన్నిక‌లు కూడా పూర్త‌వుతాయి...ఫ‌లితాలు రిలీజ్ అవుతాయి. కాబ‌ట్టి జ‌నాల దృష్టంతా అప్ప‌టిక‌ల్లా రాజ‌మౌళి సినిమాపైనే ప‌డుతుంది. య‌ధావిధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా క‌మిట్ అయిన సినిమాల షూటింగ్ తిరిగి మొద‌లు పెడ‌తారు.

Tags:    

Similar News