'SSMB29'.. ఆ వార్తల్లో నిజం లేదట

'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది.

Update: 2024-01-22 11:46 GMT

'గుంటూరు కారం' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్. ఎస్ రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్, రాజమౌళి ఇద్దరూ ఓ సినిమా కోసం మొదటిసారి చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టు పై ఆది నుంచే అంచనాలు మొదలైపోయాయి. 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది.

ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక మహేష్ బాబు సైతం ఈ ప్రాజెక్టు వర్క్ షాప్ కోసం జర్మనీ వెళ్ళాడు. అక్కడ ఓ ఫిజియో ఎక్స్పర్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగనున్న అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది.

ఇప్పటివరకు నేషనల్ వైడ్ మార్కెట్ పై దృష్టి పెట్టిన రాజమౌళి మహేష్ బాబు సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 1000 నుంచి 1200 కోట్ల బడ్జెట్ ని ఈ సినిమా కోసం కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మరొకరు భాగస్వామ్యం కాబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతకంటే ముందు సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ తో కలిసి ఓ హాలీవుడ్ స్టూడియో మహేష్ - రాజమౌళి ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట.

మహేష్ బాబు - రాజమౌళి ప్రాజెక్టుని కే.యల్ నారాయణ ఒక్కరే నిర్మిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన సొంత బ్యానర్ అయిన దుర్గా ఆర్ట్స్ పైనే ఈ ప్రాజెక్టు రూపొందునున్నట్లు తెలిసింది. అంతేకాదు సినిమాకు సంబంధించి టోటల్ బడ్జెట్ ని ఆయన ఒక్కరే పెడుతున్నారని, ఇందులో మరే ఇతర నిర్మాణ సంస్థ భాగస్వామ్యం కావడం లేదని ఇన్సైడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 9న ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News