వీడియో: డ్యామిట్! జక్కన్న ఏమిటీ వింత పని!!
పనిలో హార్డ్ వర్క్ సంగతి అటుంచితే రాజమౌళిలోని ఈ కొత్త కోణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వృత్తిగత జీవితం వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. ఈ రెండిటినీ వేర్వేరుగా చూడాలి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓ వైపు పనిలో దిగితే రాక్షసుడిలా ఉంటాడని అంటారు. అపజయమెరుగని దర్శకుడిగా తన రికార్డును ఎవరూ తిరగరాయకూడదని ఆయన భావిస్తుంటారు. అందుకే పని చేసే ప్రతి సినిమాని మొదటి సినిమాగా భావించి హార్డ్ వర్క్ చేస్తారు. పనిలో హార్డ్ వర్క్ సంగతి అటుంచితే రాజమౌళిలోని ఈ కొత్త కోణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఎప్పుడూ సెట్లో పని మీదే దృష్టి సారించే రాజమౌళి ఇప్పుడు తీరిక సమయంలో ఓ ఈవెంట్లో సరదాగా డ్యాన్సులు చేసారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. అయితే జక్కన్న డ్యాన్సులు చేసాడు కానీ, ఈ రేంజులో రిథమిక్ గా స్టేజీపై డ్యాన్సులు చేయడం ఇదివరకెన్నడూ చూడలేదు. అంతగా ఆయన ఛేంజోవర్ చూపించారు. సతీమణి రమా రాజమౌళితో కలిసి ప్రభుదేవా `ప్రేమికుడు` సినిమాలోని `అందమైన ప్రేమరాణి..` సాంగ్ కి జక్కన్న స్టెప్పులేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. రొమాంటిక్ బాణికి తగ్గట్టు రాజమౌళి తన చేతులు కాళ్లు కదుపుతూ.. వైఫ్ తో మింగిల్ అయ్యి డ్యాన్సులు చేస్తున్న తీరు నిజంగా వండర్ అని కితాబిచ్చేస్తున్నారు. ఆయనలోని జోష్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రమా రాజమౌళి కూడా అంతే ఫన్నీగా ఆయనను అనుసరిస్తూ స్టెప్పులు వేసారు.
పనిలో కఠినాత్ముడే కానీ, వ్యక్తిగత జీవితంలో రాజమౌళి ఎంత జోష్ ఫుల్‌గా ఉంటారో ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం అంతర్జాలంలో సునామీ వేగంతో దూసుకుపోతున్న వీడియో ఇది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా క్లిక్ లు లైక్ లతో ఈ ప్రత్యేక వీడియో దూసుకుపోతోంది. అంత రిజర్వుడ్ గా ఉండే రాజమౌళి ఇప్పుడిప్పుడే ఇలా ఓపెనవుతున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుస మొదలైంది.
గతంలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటుకు అనీల్ రావిపూడితో కలిసి స్టెప్పేసారు. తన కుమారుడు కార్తికేయ పెళ్లిలో ఇది సాధ్యమైంది. కానీ ఇప్పుడు స్టేజీపై రెహమాన్ సంగీతం .. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన పాటకు జక్కన్న స్టెప్పులేయడం ఆసక్తిని కలిగించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రాజమౌళి తదుపరి మహష్ తో భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. విల్బర్ స్మిత్ నవలల నుండి ప్రేరణ పొంది ఈ చిత్రం కథను రూపొందించామని రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఆద్యంతం అడ్వెంచరస్ గా ఉంటుందని, ఇండియానా జోన్స్ జానర్ లో రక్తి కట్టిస్తుందని ఇదివరకే రచయిత వెల్లడించారు. రాజమౌళి మార్క్ లో ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్ మెచ్చేలా ఉంటుందని కూడా తెలుస్తోంది.