జక్కన్నకు మిగతా వాళ్లకు అదే తేడానా?
రాజమౌళి.. ఇది పేరు కాదు రాజముద్ర.. టాలీవుడ్ లో అపజయం ఎరగని దర్శకుడిగా దూసుకుపోతున్నారాయన
రాజమౌళి.. ఇది పేరు కాదు రాజముద్ర.. టాలీవుడ్ లో అపజయం ఎరగని దర్శకుడిగా దూసుకుపోతున్నారాయన. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 మూవీతో దర్శకుడిగా మారారు. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. మళ్లీ తారక్ తోనే తన రెండో సినిమా సింహాద్రి తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు.
ఆ తర్వాత సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి-1,2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు చేసిన ఆయన.. 100% స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన వర్క్స్ తో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి టాలెంట్ కోసం నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.
అందుకు ముఖ్య కారణం కల్కి 2898 ఏడీ మూవీ. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని అలరిస్తోంది. రిలీజైన అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉందని అంతా కొనియాడుతున్నారు. నాగ్ అశ్విన్ వర్క్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. పురాణాల నుంచి తీసుకున్న కాన్సెప్ట్ కు సైన్స్ ను యాడ్ చేసిన విధానం వావ్ అనేలా ఉందని చెబుతున్నారు
అయితే సినిమా బాగా తీసినా.. స్టోరీ సరైన రీతిలో నాగి చెప్పలేదని కొందరు అంటున్నారు. కొన్ని చోట్ల ఎమోషన్ మిస్ అయిందని చెబుతున్నారు. డ్రామా కాడా సరిగ్గా పండలేదని అభిప్రాయపడుతున్నారు. కానీ మూవీ బాగుందనే చెబుతున్నారు. ఇదే సమయంలో రాజమౌళిని గుర్తు చేసుకుంటున్నారు. ఎలాంటి జోనర్ స్టోరీ తీసుకున్నా.. ఎమోషన్ ను ఆడియన్స్ లోకి ఆయన బాగా ఎక్కిస్తారని చెబుతున్నారు. కథను క్లియర్ చెబుతారని అంటున్నారు.
ఎవరికి కూడా సినిమా స్టోరీపై డౌట్ రాకుండా చూసుకుంటారని చెబుతున్నారు. దీంతో ఆయన తీసిన సినిమాలు అందరికీ వెంటనే కనెక్ట్ అవుతాయని అంటున్నారు. అదే సమయంలో నాగ్ అశ్విన్ టాలెంట్ ను తక్కువ చేయడం లేదని, కానీ కల్కి సినిమా కథను ఇంకాస్త బెస్ట్ గా చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఎమోషన్ ను బాగా పండించాల్సిందని అంటున్నారు. టాలీవుడ్ లో దర్శకులందరికీ జక్కన్నకు ఇదే తేడా అని చెబుతున్నారు.