పెద్దాయన ఈసారి ఆ ఛాన్స్ తీసుకోరేమో!
వరుస పరాజయాల నేపథ్యంలో ఎప్పుడూ ట్రోలింగ్ కి గురి కాయన పెద్దాయన తొలిసారి ట్రోలింగ్ బారిన పడ్డారు.
ఇటీవల రిలీజ్ అయిన ఓ చిత్రం కంటే ముందు విడుదలైన ఓ సినిమాతో పెద్దాయన కాస్త ఊపిరి తీసుకున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాల నడుమ విడుదలై విజయం సాధించిన చిత్రమిది. ఆ ఆతర్వాత రిలీజ్ అయిన సినిమా మళ్లీ పాత పల్లవే అందుకుంది. దీంతో ఆ స్టార్ హీరో ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయింది. ఇలా ఇన్ని వైఫల్యాలకి కారణం ఏంటి? అంటే ప్రధానంగా ఆయా కథల్లో..ఆన్ సెట్స్ లో ఆయన వేలు పెట్టడమే కారణమని నెట్టింట వైరల్ అయింది.
దర్శకుల పని దర్శకుల్ని చేసుకోనివ్వగల్గితే అలాంటి ఫలితాలు వచ్చేవి కాదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. అయితే ఈ అభిప్రాయం పై ఆయన చుట్టూ తిరిగే కొంత మంది నిప్పులు చెరిగారు. ఎలాంటి సినిమాలు చేయాలో ఆయనకు తెలియదా? అన్నేళ్ల అనుభవం ఉంది? ప్రేక్షకుల పల్స్ ఆయన పట్టుకోలేరా? అంటూ పెద్ద లెక్చర్లు ఇచ్చారు. నిజానికి ఆ పెద్దాయన వైఫల్యానికి వీళ్లంతా కూడా పరోక్ష కారకులగానూ కొంత మంది విశ్లేషించారు.
ఇదంతా గతం. మరి ఇప్పుడా పెద్దాయన మారే అవకాశం ఉందా? అంటే అందుకు అవకాశాలు ఎక్కువ గానే కనిపిస్తున్నాయి. వరుస పరాజయాల నేపథ్యంలో ఎప్పుడూ ట్రోలింగ్ కి గురి కాయన పెద్దాయన తొలిసారి ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆ సినిమాలు నిర్మించిన వారికి..పంపి ణీదారులకి..బయ్యర్లకి అందరికీ నష్టాలు మిగిలాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయన పై ఉంది.
అలా జరగాలంటే ఇప్పుడాయన పూర్తిగా దర్శకుల హీరో అవ్వాలి. ఇటీవలే ఓ రెండు సినిమాలు కూడా ప్రకటించారు. ఆయశలన్నీ వాటిపైనే ఉన్నాయి. ఇద్దరు కొత్త దర్శకులు. అయితే మంచి సక్సెస్ రేట్ ఉంది.
అది చూసే పెద్దాయన అవకాశం కల్పించారు. రెండు కాస్త డిఫరెంట్ స్టోరీలు అని తెలుస్తోంది. దీంతో ఈ సారి పెద్దాయన ఆయా కథల్లోగానీ..ఆన్ సెట్స్ లో గాని వేళ్లు పెట్టే అవకాశం లేదని వినిపిస్తోంది.