ఖరీదైన వాచ్‌లతో స్టార్ హీరోల హల్చల్
వాచ్‌లను అమితంగా ఇష్టపడే అనంత్ అంబానీ ధరించిన ఓ కొత్త వాచ్ ఖరీదు 21 కోట్లు అని తెలిసాక అందరూ షాక్ తిన్నారు.
వాచ్‌లను అమితంగా ఇష్టపడే అనంత్ అంబానీ ధరించిన ఓ కొత్త వాచ్ ఖరీదు 21 కోట్లు అని తెలిసాక అందరూ షాక్ తిన్నారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న అతిథులకు 2 కోట్ల ఖరీదైన వాచ్‌లు కానుకగా ఇచ్చారని తెలియగానే నోరెళ్లబెట్టారు. ఇదే అంబానీల పెళ్లిలో ఓర్రీ (ఓర్హాన్ అవ్రతమణి) రూ. 20 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ధరించి కనిపించాడు. ఈ విలాసవంతమైన యాక్సెసరీ, సెర్పెంటి మిస్టెరియోసి హై జ్యువెలరీ కలెక్షన్ నుంచి ఎంపిక చేసినది. 18 కెటి తెలుపు -పసుపు బంగారం, బ్రిలియంట్-కట్ డైమండ్‌లు, రెండు పియర్-కట్ పచ్చలు, పేవ్-సెట్ డైమండ్ డయల్‌తో వాచ్ మెస్మరైజ్ చేసింది.
అయితే ఖరీదైన వాచ్‌ల సేకరణలో ఎప్పుడూ బిజీగా ఉండే కొందరు స్టార్ల గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఇందులో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. ఇటీవల ప్రతిష్టాత్మక వాచ్‌మేకింగ్ బ్రాండ్ జాకబ్ & కో CEO అయిన జాకబ్ అరబోతో ఇటీవల కరచాలనం చేస్తున్న ఫోటోని సల్మాన్ ఖాన్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఖాన్ రిస్ట్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సల్మాన్ మణికట్టుపై అద్భుతమైన విలాసవంతమైన వాచ్ కళ్లు తిప్పుకోనివ్వలేదు. దీని ఖరీదు కోటి పైగానే ఉంటుందని టాక్ వినిపించింది. ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన మరో అగ్రకథానాయకుడు సంజయ్ దత్ ఏకంగా 1.2 కోట్ల ఖరీదైన వాచ్ ని ప్రదర్శించి ఔరా! అనిపించాడు. సంజయ్ దత్ తనకు తానే 4 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన పుట్టినరోజు బహుమతిని ఇచ్చుకుని ఆశ్చర్యపరిచాడు. అదే సమయంలో అతడి వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇంతకుముందు పెళ్లి వేడుకల్లో అనంత్ అంబానీ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వివాహ వేడుకల సందర్భంగా అతడు అసాధారణమైన రెడ్ కార్బన్ TPT రిచర్డ్ మిల్లె RM 57-03 డ్రాగన్ టూర్‌బిల్లాన్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ని ధరించాడు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వాచ్ విలువ దాదాపు 21 కోట్లు (210 మిలియన్ రూపాయలు). ఇది యూనిక్ స్టైల్, ఫీచర్స్ తో డిజైన్ పరంగా ఆకట్టుకుంది. ఆసక్తికరంగా ఈ పెళ్లిలో అనంత్ తన సన్నిహితులకు ప్రీమియం వాచీలను కూడా అందించాడు. ఈ సెట్లు ఒక్కొక్కటి దాదాపు 2 కోట్లు (20 మిలియన్ రూపాయలు) ఖర్చుతో కొనుగోలు చేసారు.
టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్- ఎన్టీఆర్ ఖరీదైన రిచర్డ్ మిల్లె వాచీలు ధరించి పలు సందర్భాల్లో కనిపించారు. రామ్ చరణ్ తన చేతికి ధరించిన RM029 బ్రాండ్ వాచ్ ధర రూ. 1.5 కోట్లు. ఈ వాచ్ కోసం చెల్లించిన పన్నులు, దిగుమతి సుంకాలను పరిగణనలోకి తీసుకుంటే రేటు ఇంకా పెరుగుతుంది. ముంబైలో ఓ ఈవెంట్ కోసం అటెండయిన జూనియర్ ఎన్టీఆర్ రూ. 8.7 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లీ వాచ్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రదర్శించారు. ఖరీదైన కార్లు మాత్రమే కాదు.. ఖరీదైన వాచ్ లు స్టార్ల స్థాయిని ఎలివేట్ చేస్తున్నాయి. అందుకే వాటికి అంతటి ప్రాధాన్యత ఉంటుందని అర్థం చేసుకోవాలి.