బాన పొట్ట అధిక‌ బ‌రువుతో స్టార్ హీరో షాక్‌లు

ఇటీవ‌ల ఓ మ‌రాఠా చిత్రం ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ కి అతిథిగా వెళ్లిన స‌ద‌రు స్టార్ హీరోపై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయ్.

Update: 2024-08-11 02:45 GMT

మెలితిరిగిన కండ‌లు.. భీక‌ర దేహ‌ధారుఢ్యం.. 6 ప్యాక్ యాబ్స్ తో అత‌డు మ‌గువ‌ల గుండెల్లో చ‌లిజ్వ‌రం పుట్టించాడు. అయితే అది ఒక‌ప్పుడు.. ఇప్పుడు అత‌డికి బాన పొట్ట వ‌చ్చింది. బ‌రువు అధికంగా పెరిగాడు. దీంతో అత‌డు న‌డుస్తుంటే ఎంత‌గా ప్ర‌(ఆ)యాస‌ప‌డుతున్నాడో స్ప‌ష్ఠంగా ఆ వీడియోల్లో క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఓ మ‌రాఠా చిత్రం ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ కి అతిథిగా వెళ్లిన స‌ద‌రు స్టార్ హీరోపై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయ్.

ఉన్న‌ట్టుండి ఈ స్టార్ హీరోకి అంత పెద్ద పొట్ట ఎలా వ‌చ్చింది. ఆన్ స్క్రీన్ పై అత‌డి రూపానికి మెస్మ‌రైజ్ అయిపోయే అభిమానులు ఇప్పుడు ఈ మారిన రూపాన్ని చూడ‌ట‌మెలా? అంటూ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ మొద‌లైంది. అయితే స‌ద‌రు స్టార్ హీరో అలా మార‌డానికి కార‌ణాల‌ను ర‌క‌ర‌కాల కోణాల్లో విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా అత‌డు ఎంత జిమ్ చేసినా ఇప్పుడు కంట్రోల్ త‌ప్ప‌డానికి ప్ర‌ధాన కార‌ణం పెరిగిన వ‌య‌సు. అత‌డి ఏజ్ ష‌ష్ఠిపూర్తికి ద‌గ్గ‌ర‌గా వచ్చేసింది. 2026లో 60వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టేస్తాడు. అయితే 50 ప్ల‌స్ లో ఏనాడూ వ‌య‌సును క‌నిపించ‌నీయ‌కుండా అత‌డు ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కానీ ఇప్పుడు 60 వ‌య‌సుకు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే దానిని మెయింటెయిన్ చేయ‌లేక‌పోతున్నాడు. నిరంత‌ర జిమ్ కి వెళ్లినా కానీ వ‌యో భారంతో ప‌ర్ఫెక్ష‌న్ లేదు. పైగా అత‌డు బ్యాచిల‌ర్ కావ‌డంతో దాని ప్ర‌భావం కూడా అత‌డిపై ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

ఇక అత‌డు హెవీ వెయిట్ పెర‌గ‌డానికి కార‌ణం .. త‌న‌కు గ్యాంగ్ స్ట‌ర్ల నుంచి వ‌స్తున్న హ‌త్యా బెదిరింపుల వ‌ల్ల త‌లెత్తిన మాన‌సిక‌ ఆందోళ‌న ప్ర‌భావం అని కూడా భావిస్తున్నారు. ఇటీవ‌ల అత‌డి ఇంటిపై దాడి జ‌ర‌గ‌డంతో స్టార్ హీరోతో పాటు, ఇత‌ర‌ కుటుంబ స‌భ్యులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఏదో ఒక రోజు గ్యాంగ్ స‌భ్యులు స్టార్ హీరోని, అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను చంపేస్తామ‌ని హెచ్చ‌రించ‌డ‌మే గాక ప్రాక్టిక‌ల్ గా భ‌య‌పెడుతుంటే ఆ ఆందోళ‌న స్ప‌ష్ఠంగా అత‌డిలో బ‌య‌ట‌ప‌డుతోంది. ఇది కూడా అత‌డి శ‌రీరాకృతిలో మార్పున‌కు కార‌ణం కావొచ్చు అంటూ నెటిజ‌నులు చ‌ర్చిస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవ‌ల అత‌డిలో వ‌యోభారం బ‌య‌ట‌ప‌డుతోంది. దానికి తోడు ఈ వ‌య‌సులో టెన్ష‌న్లు కూడా ఇలా అధిక బ‌రువు పెర‌గ‌డానికి పొట్ట పెంచేయ‌డానికి కార‌ణ‌మైంద‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News