అదిరింది పో... వెంకీ కోసం ఇద్దరు స్టార్ హీరోలు
ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా చూసే అవకాశం ను దర్శకుడు అనీల్ రావిపూడి ఇవ్వబోతున్నాడు.
2024 సంక్రాంతికి సైంధవ్ సినిమా తో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన గత చిత్రాల మాదిరిగానే సైంధవ్ నిరాశ పరిచింది. కమర్షియల్ గా వెంకీ హిట్ అందుకుని చాలా కాలం అయ్యిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటన వచ్చింది.
ఇంకా ప్రకటించకుండానే సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రకటించారు. విచిత్రం ఏంటి అంటే ఈ సినిమా టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం అనేది పుకారు. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఈ టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనిల్ రావిపూడి ఇలాంటి విభిన్నమైన టైటిల్స్ తోనే వస్తాడు.. కనుక ఆ పుకారు నిజమేనేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్ 2 మరియు ఎఫ్ 3 సినిమాలు వచ్చి నవ్వులు పూయించాయి. ఇప్పుడు మరోటి రాబోతుంది.
ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా చూసే అవకాశం ను దర్శకుడు అనీల్ రావిపూడి ఇవ్వబోతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిల్ రావిపూడికి సన్నిహితంగా ఉండే రవితేజ మరియు బాలకృష్ణ లు వెంకీ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారట. ఈ వార్త ఆయా హీరోల ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. అదిరింది పో అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి వారి సినిమాలు విడుదల ఉండక పోవచ్చు. అందుకే వారిని ఈ సినిమాలో భాగస్వామ్యం చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. ఇద్దరు హీరోలు ఆ మధ్య కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు. కనుక వారిని కలిపి గెస్ట్ రోల్స్ లో నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కెరీర్ ఆరంభం నుంచి కూడా దర్శకుడిగా అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, మాస్ ఎలిమెంట్స్ ను జత చేసి చూపించడం ద్వారా అనిల్ రావిపూడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. అందుకే వెంకీ తో చేయబోతున్న సినిమా కూడా వచ్చే సంక్రాంతికి హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.