సలార్, బాహుబలి వైపు దూసుకు వెళ్తున్న 'స్త్రీ'
స్త్రీ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు రూ.402 కోట్లుగా సమాచారం అందుతోంది.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ స్త్రీ కి సీక్వెల్ గా రూపొందిన స్త్రీ 2 వసూళ్ల జోరు కంటిన్యూ అవుతోంది. ఒక చిన్న సినిమాగా మొదలైన స్త్రీ 2 జోరు చిన్న చిన్నగా పెరుగుతూ వచ్చింది. మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన స్త్రీ 2 సినిమా మూడో వారం లో కూడా తగ్గలేదు. ఆగస్టు 15న విడుదల అయిన స్త్రీ 2 సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించినప్పుడే అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు స్త్రీ 2 వసూళ్లు ఏకంగా రూ.500 కోట్ల మార్క్ ను టచ్ చేసింది.
ఇప్పుడు స్త్రీ 2 వసూళ్ల పరుగు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా వసూళ్ల వైపు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 406.45 కోట్లు రాబట్టింది. స్త్రీ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు రూ.402 కోట్లుగా సమాచారం అందుతోంది. ఈ వీకెండ్ లో సలార్ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరో వైపు బాహుబలి 1 వసూళ్ల వైపు కూడా స్త్రీ 2 సినిమా వసూళ్లు దూసుకు వస్తున్నాయి.
రజినీకాంత్ హీరోగా నటించిన 2.0 సినిమా కి రూ.407 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ వీకెండ్ లో ఆ రికార్డ్ కూడా బ్రేక్ అవ్వడం ఖాయం అంటూ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాహుబలి 1 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.421 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. లాంగ్ రన్ లో స్త్రీ 2 సినిమా కచ్చితంగా బాహుబలి 1 వసూళ్లను బ్రేక్ చేయడం ఖాయం. అయితే పఠాన్ మరియు యానిమల్ వసూళ్లు మాత్రం రూ.500 కోట్లకు పైగా ఉన్నాయి. కనుక స్త్రీ సినిమా అక్కడి వరకు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రాజ్ కుమార్ రావు హీరోగా, శ్రద్దా కపూర్ హీరోయిన్ గా రూపొందిన స్త్రీ 2 సినిమా లో పంజక్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, వరుణ్ ధావన్ లు కీలక పాత్రలో కనిపించారు. బాలీవుడ్ సినిమాలు మినిమం వసూళ్లు సాధించలేని పరిస్థితుల్లో ఈ సినిమా వందల కోట్లు వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో మంచి కంటెంట్ ఉంటే బాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలను ఆధరిస్తారనే నమ్మకం కుదిరింది. అందుకే స్త్రీ 2 వంటి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలని యంగ్ అండ్ సీనియర్ ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.