ఇద్దరి హీరోలపై 400 కోట్లు హిట్టిస్తారో లేదో
కేఈ జ్ఞాన్ వేల్ రాజా ప్రొడ్యూసర్ గా స్టూడియో గ్రీన్ భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
కోలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్స్ హౌస్ లో ఒకటిగా స్టూడియో గ్రీన్ ఉంది. భారీ బడ్జెట్ లతో స్టార్ హీరోల సినిమాలని ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తూ ఉంటుంది. స్టూడియో గ్రీన్ 2006లో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది. తరువాత వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా మూవీస్ చేస్తూ వస్తోంది. ఎక్కువగా సూర్యతో ఈ నిర్మాణ సంస్థ మూవీస్ ని చేయడం విశేషం. కేఈ జ్ఞాన్ వేల్ రాజా ప్రొడ్యూసర్ గా స్టూడియో గ్రీన్ భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ ఏడాది స్టూడియో గ్రీన్ నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. అలాగే ఒక తెలుగు సినిమా, ఒక బైలింగ్వల్ మూవీ కూడా లిస్ట్ లో ఉన్నాయి. తెలుగులో అల్లు శిరీష్ హీరోగా బడ్డీ అనే సినిమాని చేశారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ సినిమాని స్టూడియో గ్రీన్ ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని పా రంజిత్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాపై అంచనాలు హెవీగానే ఉన్నాయి. దీని తర్వాత అక్టోబర్ 10న పాన్ వరల్డ్ రేంజ్ లో సూర్య కంగువ మూవీ రాబోతోంది. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లకు పైనే. శివ దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అయ్యింది. ఈ రెండు సినిమాలపై దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది.
స్టూడియో గ్రీన్ ఈ రెండు సినిమాలపై ఏకంగా 400 కోట్ల వరకు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో కచ్చితంగా ఒక్క సినిమా అయిన హిట్ కావాలి. స్టూడియో గ్రీన్ లో భారీ సక్సెస్ పడి చాలా కాలం అయ్యింది. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇవి హిట్ అయితే స్టూడియో గ్రీన్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది.
ఈ రెండు పెద్ద సినిమాలు కాకుండా కార్తీ హీరోగా వావాతియార్ అనే సినిమాని కూడా స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ ఏడాదిలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి 4 సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయని అర్ధమవుతోంది. అంటే దాదాపు 500 కోట్ల పెట్టుబడులు. మరి రాబోయే సినిమాల్లో ఎన్ని సక్సెస్ అవుతాయనేది వేచి చూడాలి.