ట్రైలర్ టాక్.. సుహాస్ గొర్రె పురాణం..

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-16 10:31 GMT
ట్రైలర్ టాక్.. సుహాస్ గొర్రె పురాణం..
  • whatsapp icon

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. లైన్ లో పెట్టడమే కాకుండా.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. సుహాస్ సినిమా అంటే చాలు.. అందులో కచ్చితంగా ఓ ప్రత్యేకమైన విషయం ఉంటుందని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోతున్నారు. అంతలా పేరు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్.. గత నెలలో ప్రసన్నవదనం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రీసెంట్ గా జనక అయితే గనక మూవీతో సందడి చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఇప్పుడు గొర్రె పురాణం మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. అదే జోష్ తో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టైటిల్‌ లో ఉన్నట్టుగానే ఒక గొర్రె సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. 'గొర్రె జైలులో ఉండటం ఏంది.. ఆడకెళ్లి తప్పించుకోవడం ఏంది.. ఇదంతా వింతగా ఉంది కదా..; అంటూ వస్తున్న డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ఆ తర్వాత గొర్రె ఓ చోట కల్లు తాగుతుంది. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒక గొర్రె చేసిన ప‌ని వల్ల రెండు మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు గొడవకు దిగాల్సి వస్తుంది. ఇంతలో జైలు దుస్తులతో సుహాస్ గొర్రె పట్టుకుని పరిగెడుతుంటాడు. 'మనం బతకడం కోసం వాటిని చంపేయొచ్చు.. మనది ఆకలి.. దాని బతుకు కోసం మనల్ని చంపేస్తే ఆత్మ రక్షణే కదా సర్..' అంటూ కోర్టులో సుహాస్ చెప్పిన డైలాగ్ ఆలోచన రేకెత్తిస్తుంది.

అయితే అసలు గొర్రె వల్ల గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? సుహాస్ ఎందుకు జైల్లో ఉన్నాడు? అతడికేంటి సంబంధం? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్టోరీ పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సుహాస్ మరోసారి తన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఓవరాల్ గా ట్రైలర్.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది. మరి గొర్రె పురాణం సెప్టెంబర్ 20వ తేదీ రిలీజ్ అవుతుండగా.. ఎలాంటి హిట్ కానుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News