స్వాగ్ సాంగ్.. సుకుమార్ సార్ మీరొక మాన్‌స్టర్!

సుకుమార్ దర్శకత్వం ప్రతిభను అలాగే ఆయన గొప్పతనాన్ని స్వాగ్ రూపంలో విడియోలో హైలెట్ చేశారు.

Update: 2024-12-09 07:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా డిఫరెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దర్శకులలో సుకుమార్ టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఆయన మొదటి సినిమా నుంచి కూడా ఆడియన్స్ కు ఒక భిన్నమైన తరహాలో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులుగా కొత్తగా అడుగులు వేసే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ప్రేరణగా నిలిచారు అని చెప్పవచ్చు. ఆయన రాసుకునే కథ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే ఎమోషన్స్ కు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిత్వంలో కూడా ఉన్నతమైన మనిషి. అందుకే ఫ్యాన్స్ లో సుకుమార్ హై రేంజ్ లవ్ ఉంది.

ఇక సుకుమార్ పుష్ప రాజ్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి వరల్డ్ వైడ్ గా ఒక డిఫరెంట్ మేనియాను క్రియేట్ చేశారు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సక్సెస్ ను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఒక వీరాభిమాని తన ర్యాప్ సాంగ్ తో సుకుమార్ కు ఫ్యాన్స్ కు మరొక మంచి అనుభూతిని అయితే ఇచ్చారు.

సుకుమార్ దర్శకత్వం ప్రతిభను అలాగే ఆయన గొప్పతనాన్ని స్వాగ్ రూపంలో విడియోలో హైలెట్ చేశారు. పుష్ప సినిమాకు సంబంధించిన లొకేషన్స్ మూమెంట్స్ ని కూడా హైలెట్ చేశారు. అలాగే ఆయన కంటెంట్ బలాన్ని హైలైట్ చేస్తూ ఈ సాంగ్ లో మలిచిన విధానం ఎంతగానో ఆకట్టకుంటోంది. అలాగే సుకుమార్ సార్ మీరు ఒక మాన్ స్టర్ అంటూ రాసుకున్న లైన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి.

ఫాన్స్ లో సుకుమార్ ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారో మరోసారి అర్థమవుతుంది. ఇక పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసింది. తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ ను అందుకుంటుంది అని విడుదలకు ముందే చాలా మంది కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు అనుకున్నట్లుగానే ఈ సినిమా ఇండియన్ హిస్టరీలో ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది.

Full View
Tags:    

Similar News