త‌ను లేకుండా సినిమా చేయ‌లేదు, ఇక‌ముందు కూడా చేయ‌ను: సుకుమార్

ఆర్య సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన సుకుమార్ త‌క్కువ టైమ్ లోనే మంచి డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు.

Update: 2025-02-09 06:22 GMT

ఆర్య సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన సుకుమార్ త‌క్కువ టైమ్ లోనే మంచి డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ల‌లో సుకుమార్ కూడా ఒక‌డు. ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా నిరాశ‌ప‌రిచినా ఆ సినిమాల‌కు ఉండే గౌర‌వం ఎప్పుడూ ఉంటుంది.

త‌న సినిమాల‌తో, త‌న ఆలోచ‌న‌ల‌తో సుకుమార్ ఆడియ‌న్స్ ను ఎప్పుడూ థ్రిల్ చేస్తూనే ఉంటాడు. పుష్ప ముందు వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న క్రేజ్, ఆ సినిమా త‌ర్వాత ఇండియ‌న్ సినిమా లెవెల్ లో పెరిగింది. ప్ర‌స్తుతం ఇండియాలో స్టార్ డైరెక్ట‌ర్లలో సుకుమార్ కూడా ఒక‌డు. పుష్ప సినిమాతో ఆయ‌న అంత పెద్ద హిట్ అందుకున్నాడు.

పుష్ప సినిమా చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో అప్ప‌టివ‌ర‌కు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యాడు. ర‌ష్మిక నేష‌న‌ల్ లెవెల్ లో పాపుల‌రైంది. ఇక పుష్ప ఫ్రాంచైజ్ సినిమాల‌కు దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన సంగీతం గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప‌, పుష్ప‌2లోని ప్ర‌తీ పాట ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ లో క్లిక్ అయింది.

దేవీ ఏ డైరెక్ట‌ర్ తో పని చేసినా రాని అవుట్‌పుట్ సుకుమార్ సినిమాల‌కు వ‌స్తుంది. అది వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న బాండింగ్, అండ‌ర్‌స్టాండింగ్. సుకుమార్ సినిమాల‌కు దేవీ ఇచ్చే మ్యూజిక్ చాలా స్పెష‌ల్ గా ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌తీ సినిమాకీ దేవీ శ్రీ ప్ర‌సాదే సంగీతం అందించాడు.

రీసెంట్ గా జ‌రిగిన పుష్ప‌2 థ్యాంక్స్ మీట్ లో సుకుమార్ సైతం ఇదే చెప్పాడు. త‌న పేరు సుకుమార్ కాద‌ని, త‌న పేరు సుకుమార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ అని అన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు త‌ను చేసిన ప్ర‌తీ సినిమాకీ దేవీనే సంగీత‌మందించాడ‌ని, దేవీ లేకుండా తాను ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేయ‌లేద‌ని, ఇక ముందు కూడా చేయ‌లేన‌ని సుకుమార్ తెలిపాడు. పుష్ప‌2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవీతో పాటూ మ‌రికొంద‌రిని తీసుకున్న‌ప్పుడు ఇక దేవీకి, సుక్కూకి వ‌ర్క‌వుట్ అవ‌ద‌ని, ఇద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయ‌ర‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సుకుమార్ చెప్పిన మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే వారి మ‌ధ్య బాండింగ్ ఎంత హెల్దీగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News