అందులో కిక్కు కనిపెట్టిన సుక్కు..!

ఆర్య డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు.

Update: 2024-05-08 08:55 GMT

తెలుగులో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ 20 ఏళ్ల కెరీర్ లో 8 సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. ఆర్యతో డైరెక్షన్ మొదలు పెట్టిన సుకుమార్ ఆ తర్వాత తన సక్సెస్ మేనియా కొనసాగించాడు. తన ఆర్య హీరో అల్లు అర్జున్ తో పుష్ప 1 తీసి పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు సుకుమార్. త్వరలోనే పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఒక స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆర్య డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు.

ఈవెంట్ లో అందరు 20 ఏళ్లు వెనక్కి వెళ్లి ఆర్య సినిమా టైం విషయాలను గుర్తు చేసుకున్నారు. అందరిలో సుకుమార్, అల్లు అర్జున్ స్పీచ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. గంగోత్రి తర్వాత తను చేసిన ఆర్య సినిమా వల్లే తన లైఫ్ మారిపోయిందని ఆర్య లేకపోతే ఎలా ఉండేదో అంటూ.. తనను ఇక్కడ నిలబెట్టింది ఆర్య సినిమానే అంటూ చెప్పుకొచ్చాడు.

సుకుమార్ కూడా ఆర్య కోసం తానుజరిగినా పడిన కష్టాన్ని.. నిర్మాత దిల్ రాజుతో గొడవని చెప్పాడు. ఈ క్రమంలో సినిమాలో ఐటెం సాంగ్ గురించి ప్రస్తావించాడు సుకుమార్. దిల్ రాజు ఆర్య లో ఐటెం సాంగ్ పెడదామని దానికి తాను ఆయనతో గొడవ పడ్డానని.. అ అంటే అమలాపురం ఎలాగోలా సినిమా పెట్టించారని. అయితే ఆ తర్వాత తాను ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ పెడుతున్నానని. తనకు ఆ సాంగ్స్ ఇచ్చే వైబ్ తెలిసి తాను కొనసాగిస్తున్నానని అన్నారు సుకుమార్. తనని ఐటెం సాంగ్స్ చేయమని చెప్పి దిల్ రాజు మాత్రం కళాత్మక సినిమాలు చేస్తూ వచ్చారని సుకుమార్ చెప్పారు.

సుకుమార్ చేసిన 8 సినిమాలను ఒక లుక్ వేస్తే ఆర్య లో ఆ అంటే అమలాపురం బ్లాక్ బస్టర్ కాగా.. జగడం లో ము ముద్దంటే చేదా.. ఆర్య 2 లో రింగ రింగ, 100% లవ్ లో డియ్యాలో డియ్యాలో, 1 నేనొక్కడినేలో లండన్ బాబు, రంగస్థలం లో జిగేలు రాణి, పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్. ఇలా స్పెషల్ సుకుమార్ చేసిన స్పెషల్ సాంగ్స్ కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చుకునేలా చేశాడు. ఆ సాంగ్స్ సినిమాల్లోనే కాదు ఎక్కడ పార్టీ జరిగినా వింపించేలా చేశాడు. అలా ఐటెం సాంగ్స్ తో కూడా తన ముద్ర వేశాడు సుకుమార్.

Tags:    

Similar News